టీడీపీ అధినేత చంద్రబాబుతో మోహన్‎బాబు భేటీ

YCP Leader Mohan Babus Meeting With Chandrababu
x

టీడీపీ అధినేత చంద్రబాబుతో మోహన్‎బాబు భేటీ

Highlights

*కూతురు లక్ష్మితో కలిసి బాబుతో భేటీ అయిన మోహన్‎బాబు

Mohan Babu: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ప్రముఖ సీనియర్ నటుడు మోహన్ బాబు ముఖాముఖి భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని చంద్రబాబునాయుడు ఇంటికి కూతురు మంచు లక్ష్మితో కలిసి స్వయంగా వెళ్లి మోహన్ బాబు కలవడం సంచలనం ఆసక్తికరంగా మారింది. వీరి భేటీ దాదాపు 2 గంటలు సాగినట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుత రాజకీయాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించుకున్నట్టు సమాచారం. సినీ న‌టుడిగా కొన‌సాగుతూనే రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మోహ‌న్‎బాబు టీడీపీతోనే త‌న ప్రస్థానం మొద‌లుపెట్టారు. ఆ తరువాత అదే పార్టీ త‌ర‌ఫున రాజ్యస‌భ స‌భ్యుడిగానూ కొన‌సాగారు.

ఆ త‌ర్వాత పార్టీ నుంచి దూరంగా జ‌రిగిన మోహ‌న్ బాబు చంద్రబాబుకు సైతం వైరివ‌ర్గంగా మారిపోయారు.ఇక 2019 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలో చేరిన మోహ‌న్ బాబు పార్టీ నుంచి ఎలాంటి అవ‌కాశం ద‌క్కకున్నా పార్టీలోనే కొన‌సాగారు. ఈ క్రమంలో వైసీపీతోనూ దూరంగా ఉన్నారు. ఆ తరువాత ఓ సందర్భంలో వైసీపీకి రాజీనామా చేస్తున్నాన‌ని, ఇక‌పై రాజ‌కీయాల జోలికి వెళ్లనని ప్రక‌టించారు. మరోవైపు తాను బీజేపీ సిద్ధాంతాల‌ను అవ‌లంబించే వ్యక్తిగా త‌న‌ను తాను ఇటీవలే ప్రక‌టించుకోవడం విశేషం. ఈ క్రమంలో తాజాగా చంద్రబాబుతో మోహ‌న్ బాబు భేటీ కావ‌డం ఏపీ రాజ‌కీయాల్లో ఆస‌క్తి రేకెత్తిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories