NTR: హెల్త్ వర్శిటీ పేరు మార్పుపై స్పందించిన లక్ష్మీపార్వతి.. నా పెళ్లి గురించి ఎవరైనా కామెంట్ చేస్తే..

Laxmi Parvathi: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నేపథ్యంలో తనపై మీడియాలో వస్తున్న కథనాలపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్రంగా ఫైర్ అయ్యారు.

Arun Chilukuri
Published on: 26 Sept 2022 12:15 PM IST
YCP Leader Lakshmi Parvathi Warning Who Commented Her Marriage
X

NTR: హెల్త్ వర్శిటీ పేరు మార్పుపై స్పందించిన లక్ష్మీపార్వతి.. నా పెళ్లి గురించి ఎవరైనా కామెంట్ చేస్తే..

Laxmi Parvathi: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నేపథ్యంలో తనపై మీడియాలో వస్తున్న కథనాలపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఏ సంఘటన జరిగినా తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న వారిపై కేసులు పెడతామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఎన్టీఆర్‌కు నాతో పెళ్లి అవటం చంద్రబాబుకు ముందు నుంచీ ఇష్టం లేదని మా వివాహ ప్రకటనను అడ్డుకోవటానికి చంద్రబాబు మైకు వైరులు కట్ చేసి లైట్‌లు ఆఫ్ చేసి నానా బీభత్సం చేశాడని ఆగ్రహించారు.

అందరి సమక్షంలో జరిగిన మా వివాహం గురించి ఎవరైనా అనుచితంగా వ్యాఖ్యానిస్తే కేసు పెడతానని.. నేను రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. ఎన్టీఆర్ భార్య పదవికి మించి ఇంకే పదవి నాకు పెద్దది కాదు.. ఎన్టీఆర్ పెరాల్సిస్ అనారోగ్యం, పిల్లలకు ఆస్తుల పంపకాలు, అధికారం కోల్పోయిన పరిస్థితుల్లో నేను ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చానని వివరించారు. నేను వచ్చిన తర్వాత ఆరోగ్యమే కాదు అధికారం కూడా తిరిగి వచ్చిందని పేర్కొన్నారు లక్ష్మీ పార్వతి.

అప్పట్లో చంద్రబాబు చేసిన దుర్మార్గానికి కుటుంబసభ్యులు వంత పాడారని తెలిపారు. అల్లుళ్ల కొట్లాట వల్లే 1989 ఎన్నికల్లో ఓడిపోయామని అప్పట్లో ఎన్టీఆర్ తనకు చెప్పారన్నారు. ఇప్పుడు చంద్రబాబు అధికార వ్యామోహాన్ని పక్కదారి పట్టించేందుకు తనపై ఆరోపణలు చేస్తున్నారని.. ఇలాంటి దుర్మార్గపు ప్రచారాలను నమ్మవద్దని లక్ష్మీపార్వతి కోరారు. యూనివర్సిటీ కంటే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడమే గొప్ప విషయమని లక్ష్మీపార్వతి అన్నారు. ఎన్టీఆర్ హంతకులకు ఆయన పేరు ప్రస్తావించే అర్హత లేదన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా ఎన్టీఆర్ పేరు పెట్టారా అని ప్రశ్నించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story