తూర్పు గోదావరి జిల్లా టోల్ సిబ్బందిపై వైసీపీ వర్గీయుల దాడి...

YCP Leader Followers Attack on Toll Gate Staff Veeravalli Toll Gate | AP Live News
x

తూర్పు గోదావరి జిల్లా టోల్ సిబ్బందిపై వైసీపీ వర్గీయుల దాడి...

Highlights

East Godavari: మాజీ ఎమ్మెల్సీ మేక శేషుబాబు అనుచరుల దాడి...

East Godavari: తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి చెక్ పోస్ట్ వద్ద వైసీపీ నేత అనుచరులు వీరంగం సృష్టించారు. ముగ్గురు టోల్ గేటు సిబ్బందిపై దాడి చేసి పిడి గుద్దులు కురిపించారు. ఇంతకీ టోల్ గేట్ సిబ్బంది చేసిన పాపం ఏమాటంటే టోల్ ఫీజు కట్టాలని అడగడమే. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తన అనుచరులతో వెళ్తు... వీరవల్లి చెక్ పోస్ట్ వద్దకు వచ్చారు. ఆయన కారుకు ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉండడంతో, ఆయన ఎమ్మెల్సీనే అని సిబ్బంది అనుకున్నారు.

అయితే స్టిక్కర్ ను పరిశీలించగా, దాని కాలపరిమితి 2017తో ముగియడం, ఆయన మాజీ ఎమ్మెల్సీ అని తెలియడంతో టోల్ ఫీజు కట్టాలని సిబ్బంది అడిగారు. అంతేకాకుండా ఆయన కారు వీఐపీ పాస్ గుండా వెళుతుండడంతో, వీఐపీలు మాత్రమే ఈ ఎగ్జిట్ ద్వారా వెళ్ళాలని సూచించారు. దీంతో మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు అనుచరులు జోక్యం చేసుకుని టోల్ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. ముగ్గురు టోల్ గేటు సిబ్బందిని చితకబాదారు.

Show Full Article
Print Article
Next Story
More Stories