AP Elections:ఎన్నికలలో మా పార్టీ దౌర్జన్యాలకు పాల్పడింది: వైసీపీ నేత

AP Elections:జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు మరింత పెరిగాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు .

Samba Siva Rao
Published on: 8 March 2021 6:27 PM IST
Ycp Ex Mla David Raju
X

డేవిడ్ రాజు ఫైల్ ఫోటో 

AP Elections: జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు మరింత పెరిగాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికలలో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని, ప్రత్యర్థులను బెదిరించి ఏకగ్రీవాలకు చేసుకుందన్నారు. తాను త్వరలోనే అనుచరులతో కలిసి టీడీపీలో చేరుతానని డేవిడ్ రాజు ప్రకటించారు. మంత్రి బాలినేని శ్రీనవాసరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. నగరంలో ఎక్కడి సమస్యలు పరిష్కారానికి బాలినేని కృషి చేయలేదని, ఏ ముఖం పెట్టుకొని ఒంగోలు ప్రజలను బాలినేని ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు.

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు ఓట్లు వేయాలని డేవిడ్ రాజు కోరారు. తాజా వైసీపీ మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు వ్యాఖ్యలు అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 2014 ఎన్నికలలో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వైసీసీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో డేవిడ్ రాజు 30 వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం అప్పటి అధికార పార్టీ టీడీపీలోకి ఫిరాయించారు. 2019 శాసనసభా ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ రాకపోవడంతో తిరిగి వైసీపీలో చేరారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story