Dharmavaram: బీజేపీ నాయకులపై వైసీపీ కార్యకర్తల దాడి

Dharmavaram: ప్రెస్‌క్లబ్‌లోకి కర్రలతో పరుగులు పెట్టిన వైసీపీ నేతలు

Rama Rao
Published on: 28 Jun 2022 5:15 PM IST
YCP Follwers Attack BJP Leaders in Dharmavaram | AP News
X

బీజేపీ నాయకులపై వైసీపీ కార్యకర్తల దాడి

Dharmavaram: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ నాయకులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటనలో ఆరుగురికి తీవ్రగాయాలు కాగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ధర్మవరంలో వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశం సందర్భంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. అయితే అదే సమయంలో మూడు వాహనాల్లో అక్కడకు చేరుకున్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లతో ప్రెస్‌క్లబ్‌లోకి పరుగెత్తుకుంటూ వెళ్లడం అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయింది. ప్రెస్‌క్లబ్‌లో ఉన్న బీజేపీ నాయకులపై విచక్షణారహితంగా దాడి జరపడంతో.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల బాధితులను పరామర్శించారు. బీజేపీ కార్యకర్తలపై దాడి చేసినవారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ కార్యకర్తలు పలువురు రోడ్డుపై బైఠాయించారు.

Rama Rao

Rama Rao

Next Story