By Election 2021 : తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థి ఖరారు

By Election 2021 : తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికకు అధికార పార్టీ వైసీపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది.

Arun Chilukuri
Published on: 16 March 2021 7:30 PM IST
By Election 2021 : తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థి ఖరారు
X

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికకు వైసీపీ అభ్యర్థి ఖరారు

By Election 2021 : తిరుపతి లోక్‌సభ నియోజకవర్గంలో జరగనున్న ఉప ఎన్నికకు అధికార పార్టీ వైసీపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. సీఎం జగన్‌ పర్సనల్ డాక్టర్ అయిన గురుమూర్తిని తమ పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసింది వైసీపీ. ఈ మేరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ఏప్రిల్ 17న తిరుపతిలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 23 నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. మార్చి 30న నామినేషన్లకు చివరి రోజు కాగా మే 2న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం ఉపఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story