Amaravati: తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో సంబరాలు

Amaravati: నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ దూసుకెళ్తుంది.

Samba Siva Rao
Published on: 21 Feb 2021 7:51 PM IST
Ycp clebrations
X

వైసీపీ జెండా 

Amaravati: ఏపీ నాలుగో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ దూసుకెళ్తుంది. వైసీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో విజయం సాధింస్తున్నారు. ఆఖరి విడతలో 3,299 పంచాయతీల్లో ఎన్నికలకు నోటిఫికేషన్లు జారీ కాగా 554 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 2,743 పంచాయతీలు, 22,423 వార్డుల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ మద్ధతుదారులు గెలుపొందటంతో ఆ పార్టీ శ్రేణులు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ముఖ్య అతిధులుగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ,ఎంపీ సంజీవ్ కుమార్, మంత్రులు బొత్స సత్యన్నారాయణ, సుచరిత, కొడాలి నాని, అనీల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాస్ సహా పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story