Tirupati By Election Results: తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం

Tirupati By Election Results: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. 2 లక్షల 31 వేలకుపైగా ఓట్ల భారీ మెజార్టీతో గురుమూర్తి గెలుపొందారు.

Arun Chilukuri
Published on: 2 May 2021 4:17 PM IST
YCP Candidate Gurumurthy Win in Tirupati By Election
X

Tirupati By Election Results: తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం

Tirupati By Election Results: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. 2 లక్షల 31 వేలకుపైగా ఓట్ల భారీ మెజార్టీతో గురుమూర్తి గెలుపొందారు. ఉప ఎన్నికలో వైసీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శించింది. ప్రస్తుతం ఇంకా కౌంటింగ్‌ కొనసాగుతోంది. వైసీపీకి మెజార్టీ మరింత పెరిగే అవకాశం ఉంది.

గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లను గురుమూర్తి సొంతం చేసుకుంటున్నారు. 2019లో దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ సాదించిన 2లక్షల 28వేల 376 ఓట్ల మెజారిటీ ఆయన అధిగమించారు. ఇప్పటికే గురుమూర్తికి ఏకంగా 5.33 లక్షల ఓట్లు పోలయ్యాయి. పనబాక లక్ష్మికి దాదాపు 3 లక్షలు రాగా బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 50వేల ఓట్లు దక్కాయి. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వైసీపీ దూసుకుపోతోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story