Tirupati By Election Results: వైసీపీ అభ్యర్ధికి భారీ ఆధిక్యం..

Tirupati By Election Results 2021: తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 2 May 2021 10:22 AM IST
YCP Candidate Gurumurthy Leads in Tirupati By Election Results
X

Tirupati By Election Results: వైసీపీ అభ్యర్ధికి భారీ ఆధిక్యం..

Tirupati By Election Results 2021: తిరుపతి ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఉప ఎన్నికలో మొత్తం 11,02,068 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రధాన పార్టీలైన వైసీపీ నుంచి ఎం.గురుమూర్తి, టీడీపీ నుంచి పనబాక లక్ష్మి, బీజేపీ తరఫున కె.రత్నప్రభ, కాంగ్రెస్‌ నుంచి చింతామోహన్‌ పోటీ చేశారు. వీరితో కలిపి మొత్తం 28 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

తిరుపతి ఉప ఎన్నికల కౌంటింగ్‌లో వైసీపీ భారీ ఆధిక్యతతో దూసుకెళ్తోంది. తిరుపతి ఉపఎన్నికలో నాలుగవ రౌండ్ పూర్తి అయ్యే సరికి వైసీపీ అభ్యర్థి ముద్దిళ్ల గురుమూర్తి ముందుజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్థి గురుమూర్తికి 31511ఓట్లు, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మీకి 17520 ఓట్లు, బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు 2191ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి 13,991 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story