Tirupati By Election Results: 2 లక్షల 21 వేలు దాటిన వైసీపీ మెజార్టీ..

YCP Candidate Gurumurthy 2,21,978 votesLeads in Tirupati By Election Results
x

Tirupati By Election Results: 2 లక్షల 21 వేలు దాటిన వైసీపీ మెజార్టీ..

Highlights

Tirupati By Election Results: తిరుపతి బైపోల్‌లో అధికార పార్టీ జోరు కనిపిస్తోంది. అంచనాకు తగ్గట్లుగానే భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది వైసీపీ.

Tirupati By Election Results: తిరుపతి బైపోల్‌లో అధికార పార్టీ జోరు కనిపిస్తోంది. అంచనాకు తగ్గట్లుగానే భారీ మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది వైసీపీ. టీడీపీ రెండో స్థానానికి పరిమితమైంది. ప్రస్తుతం వైసీపీ 2 లక్ష ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఇప్పటివరకు 2,21,978 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి దూసుకెళ్తున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని రౌండ్లలోనూ ఆ పార్టీ అభ్యర్థి గురుమూర్తి ఆధిక్యత కనబరిచారు.

టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి.. వైసీపీకి దరిదాపులో కూడా లేరు. దీంతో తిరుపతిలో వైసీపీ గెలుపు లాంఛనంగా కనిపిస్తోంది. ఇక తిరుపతి బైపోల్‌తో తమ దశ మారుతుందని ఊహించిన బీజేపీకి చుక్కెదురైంది. ఆ పార్టీ నేతల ప్రచారాలు ఏ మాత్రం ఫలించలేదు. ప్రజలు ప్రాంతీయ పార్టీలకే పట్టం కట్టేందుకు మొగ్గు చూపడంతో బీజేపీ తేలిపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది.


Show Full Article
Print Article
Next Story
More Stories