మరో టికెట్ అనౌన్స్ చేసిన వైసీపీ

Raj
By Raj
Published on: 22 Jan 2019 6:55 PM IST
మరో టికెట్ అనౌన్స్ చేసిన వైసీపీ
X

ఈసారి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఏపీలో ప్రతిపక్ష వైసీపీ పావులు కదుపుతోంది. ఇందుకోసం ఇప్పటినుంచే ఎమ్మెల్యే క్యాండేట్లను ప్రకటిస్తోంది. ఇప్పటికే కొంతమంది అభ్యర్థులను ఎంపిక చేసిన వైసీపీ.. తాజాగా అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం సీటును సిద్దారెడ్డికి ఇవ్వనుంది. ఆయనకే టికెట్ ఇస్తున్నట్టు మాజీ ఎంపీ, అనంతపురం వైసీపీ ఇంచార్జ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రకటించారు. వాస్తవంగా సిద్ధారెడ్డికి గత ఎన్నికల్లోనే టికెట్ రావాల్సి ఉంది.

కానీ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ప్రస్తుత ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషాకు చివరి నిమిషంలో టికెట్ దక్కింది. జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి చాంద్ భాషను వైసీపీలోకి తీసుకువచ్చారు. తీరా ఎన్నికల్లో గెలుపు అనంతరం మళ్ళీ టీడీపీలోకి వెళ్లిపోయారు చాంద్ బాషా. దాంతో అప్పటినుంచి సిద్దారెడ్డే కదిరికి ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా టికెట్ ఆయనకే అని చెప్పడంతో ఆయన శిబిరంలో ఆనందం నెలకొంది.

Raj

Raj

Next Story