14.29 శాతంపై ఉద్యోగ సంఘాలకు మేం వివరణ ఇచ్చాం: సజ్జల రామకృష్టారెడ్డి

ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపాం: సజ్జల అన్ని అంశాలపై డిస్కషన్ జరిగింది: సజ్జల ఫిట్‌మెంట్, హెచ్ఆర్‌ఏపై ప్రధానంగా చర్చించాం

Sandeep Reddy
Updated on: 16 Dec 2021 11:00 AM IST
YCP Advisor Sajjala Ramakrishna Reddy Completed Discussions with Employees Union About Fitment
X

సజ్జల రామకృష్టారెడ్డి (ఫోటో: ది హన్స్ ఇండియా)

Sajjala Ramakrishna Reddy: ఉద్యోగ సంఘాలతో చర్చల అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్టారెడ్డి మీడియాతో మాట్లాడారు. సహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగినట్టు సజ్జల తెలిపారు. ఈ సమావేశంలో అన్ని అంశాలతో పాటు ఫిట్‌మెంట్, హెచ్ఆర్‌ఏపై ప్రధానంగా చర్చించామన్నారు. రాష్ట్ర ఆర్ధికపరిస్థితులను ఉద్యోగ సంఘాలకు వివరించాం అన్న సజ్జల 14.29 శాతం ఫిట్‌మెంట్‌పై వివరణ ఇచ్చామన్నారు. అయితే, ఉద్యోగ సంఘాలు మాత్రం కనీసం 34శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి. ఇక రేపు మరోసారి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్నట్లు సజ్జల తెలిపారు. అవసరమైతే ఫైనల్‌గా సీఎం దగ్గరకు వెళతామన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story