ఆత్మకూరు ఉపఎన్నికలో భారీ మెజారిటీ దిశగా వైసీపీ

Atmakuru By-Election: 13 రౌండ్లు పూర్తయ్యేసరికి విక్రమ్‌రెడ్డికి ఓట్ల ఆధిక్యం

Jyothi
Published on: 26 Jun 2022 11:07 AM IST
YCP A Huge Majority in the Atmakuru By-Election
X

ఆత్మకూరు ఉపఎన్నికలో భారీ మెజారిటీ దిశగా వైసీపీ

Atmakuru By-Election: నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో వైసీసీ హవా కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపులో రౌండ్ రౌండ్‌కూ వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యం పెరుగుతోంది. 13 రౌండ్లు పూర్తయ్యే సరికి విక్రమ్‌రెడ్డి 50 వేలకు పైగా మెజారిటీ సాధించారు.

ఆంధ్రా ఇంజినీరింగ్‌ కాలేజీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 14 టేబుళ్ల ద్వారా 20 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తున్నారు. తొలిరౌండ్‌లోనే వైసీపీకి 5వేల ఓట్ల మెజార్టీ లభించింది. విక్రమ్‌రెడ్డికి 6 వేలకు పైగా ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌కు 700 పైచిలుకు ఓట్లు వచ్చాయి. రెండు, మూడో రౌండ్లోనూ వైసీపీకి అధిక్యం లభించింది. ఐదో రౌండ్‌ పూర్తయ్య సరికి వైసీపీకి 21, 241 ఓట్ల మెజారిటీ లభించింది. ఆరో రౌండ్ వరకు విక్రమ్ కు 31 వేల ఓట్లు రాగా... బీజేపీ అభ్యర్థి భతర్ కుమార్ కేవలం 5 వేల ఓట్లు మాత్రమే సాధించారు. వైసీసీ విజయం ఖాయం అని తేలడంతో బీజేపీ అభ్యర్థి భరత్‌ కుమార్‌ కౌంటింగ్‌ హాలు నుంచి వెళ్లిపోయారు.

Jyothi

Jyothi

Next Story