మళ్ళీ సీన్ లోకి వచ్చిన ఆ టీడీపీ నాయకురాలు.. ఎమ్మెల్యే అసంతృప్తి!

మళ్ళీ సీన్ లోకి వచ్చిన ఆ టీడీపీ నాయకురాలు.. ఎమ్మెల్యే అసంతృప్తి!
x
Highlights

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రకాశం జిల్లా టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పశ్చిమ ప్రకాశంలో కీలక నియాజకవర్గం యర్రగొండపాలెం. ఈ...

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రకాశం జిల్లా టీడీపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పశ్చిమ ప్రకాశంలో కీలక నియాజకవర్గం యర్రగొండపాలెం. ఈ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. ఇక్కడ టీడీపీ కూడా అలుపెరగని పోరాటం చేస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009 లో యర్రగొండపాలెం నియోజకవర్గం అవతరించింది. 2009 లో ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. ఆ తరువాత 2014 లో వైసీపీ గెలుపొందింది. ఇక్కడ రెడ్డి, ఎస్సి, ఎస్టీ ఓటర్లు అధికం. 2014 లో వైసీపీ తరుపున పాలపర్తి డేవిడ్ రాజు, టీడీపీ తరుపున భూదాల అజితారావు పోటీపడ్డారు. విజయం డేవిడ్ రాజును వరించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా డేవిడ్ రాజు టీడీపీలో చేరిపోయారు. ఆ ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసిన అజితారావు ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ త్రిసభ్య కమిటీ సభ్యుడు, జడ్పీటీసీ మున్నె రవీంద్రపై ఆమె విమర్శలు చేశారు. ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీలో చేరడంతో ఆమె వైసీపీలో చేరతారని భావించారు. కానీ ఆ పార్టీలో కూడా అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఆ పార్టీ సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమలపు సురేష్ ను యర్రగొండపాలెం ఇంచార్జ్ గా వైసీపీ అధిష్టానం. 2019 ఎన్నికలో దాదాపు ఆయనకే టికెట్ దక్కనుంది. ఈ పరిణామంతో వైసీపీలోకి వెళదామనుకున్న అజితారావు పునరాలోచనలో పడ్డారు. దాంతో ఆమె టీడీపీలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. రెండు నెలల నుంచే ఆమె మళ్ళీ సీన్ లోకి వచ్చారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ కార్యకర్తలను కలుసుకుంటున్నారు. మళ్ళీ తనకే టికెట్ అని అజితారావు ఫిక్స్ అయ్యారు. దానికి తోడు మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఆమెకు అండగా నిలబడ్డట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చెయ్యాలంటే యర్రగొండపాలెంలో అజితారావుకే టికెట్ ఇవ్వాలని మాగుంట కండిషన్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు నియోజకవర్గంలో మరొక వ్యక్తి ఇన్వాల్మెంట్ ను డేవిడ్ రాజు భరించలేకపోతున్నారట. అజితారావు పునరాగమనం పార్టీ పట్ల డేవిడ్ రాజు అసంతృప్తిగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ఇదిలావుంటే ఈసారి ఎలాగైనా ఇక్కడ జెండా ఎగురవేయాలని భావిస్తున్న టీడీపీకి.. ఇంటి పోరు తప్పేలా లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories