Yanamala Rama Krishnudu Fires On CM Jagan : రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం: యనమల

Arun Chilukuri
Published on: 26 July 2020 1:52 PM IST
Yanamala Rama Krishnudu Fires On CM Jagan : రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం: యనమల
X

Yanamala Rama Krishnudu Fires On CM Jagan : రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశాలున్నాయని టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రివర్స్ టెండర్ లతో ,రివర్స్ గ్రోత్ సి.ఎమ్.గా జగన్ ఉన్నారని ఆయన విమర్శించారు. ఎపికి ముప్పై ఏళ్లకు సరిపడా అప్పులను ఈ ఏడాదే చేశారని ఆయన అన్నారు.

2024 నాటికి ఎపి ప్రభుత్వం వడ్డీ,అసలు కలిపి లక్ష కోట్లు చెల్లించవలసి వస్తుందని ఆయన అన్నారు. ఎపి క్రెడిట్‌ రేటింగ్ దారుణంగా పడిపోయిందని, జగన్ బ్యాడ్‌ విల్ తో ఎపి గుడ్ విల్ పోయిందని ఆయన అన్నారు. ఏపీలో భూముల వేలాన్ని బిల్ట్‌ ఏపీ మిషన్‌ అని పేర్కొనడం కన్నా బిల్ట్‌ వైసీపీ మిషన్ అని పేర్కొనడం సబబని ఆయన విమర్శించారు. జగన్‌ పాలనలో తప్పొప్పులను సమీక్షకు తావు లేకుండా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శలు గుప్పించారు. గత 14 నెలల్లో ఏపీకి వాటిల్లిన నష్టానికి సీఎందే పూర్తి బాధ్యత యనమల ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story