Y V Subba Reddy: నేను పార్లమెంట్‌కు పోటీ చేయడం లేదు

Y V Subba Reddy: 175 స్థానాలు గెలవడమే టార్గెట్‌గా మార్పులు చేస్తున్నారు

Shekhar G
Published on: 15 Jan 2024 2:19 PM IST
Y V Subba Reddy Said That I Am Not Contesting For Parliament
X

Y V Subba Reddy: నేను పార్లమెంట్‌కు పోటీ చేయడం లేదు

Y V Subba Reddy: వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పార్లమెంట్‌కు పోటీ చేయడం లేదని.. తన నిర్ణయాన్ని గతంలోనే సీఎంకు చెప్పానన్నారు. 2019 ఎన్నికల నుంచి పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నానన్న వైవీ సుబ్బారెడ్డి.. ఎంపీ ఎమ్మెల్యేల టికెట్ల మార్పులపై కొందరు.. అసంతృప్తికి లోనైన మాట వాస్తవమేనన్నారు. కొత్త ఇంఛార్జ్‌ల పట్ల క్యాడర్ కొంత అసంతృప్తిగా ఉన్నా.. త్వరలో సర్దుబాటు చేసుకొని కలిసి పని చేస్తారన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల మార్పులు- చేర్పులు ఇంకా కొనసాగుతాయని.. 175 స్థానాలు గెలవడమే టార్గెట్‌గా సీఎం జగన్ మార్పులు చేస్తున్నారన్నారు వైవీ సుబ్బారెడ్డి.

Shekhar G

Shekhar G

Next Story