Y V Subba Reddy: నేను షర్మిలతో ఎలాంటి రాయబారాలు చేయలేదు

Y V Subba Reddy: తెలంగాణ ఎన్నికల సమయంలోనే.. షర్మిల కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జరిగింది

Shekhar G
Published on: 2 Jan 2024 4:42 PM IST
Y V Subba Reddy Comments On YS Sharmila
X

Y V Subba Reddy: నేను షర్మిలతో ఎలాంటి రాయబారాలు చేయలేదు

Y V Subba Reddy: మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామాపై వైసీపీ ఉత్తరాంధ్ర ఇంఛార్జ్‌ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఎన్నికల సమయంలో పార్టీలు మారడం సహజమని అన్నారు. కొందరు వ్యక్తిగత కారణాలతో పార్టీ మారుతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో కొంత మందికి టికెట్ ఇచ్చే అవకాశం లేదని వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అనకాపల్లిలో ప్రత్యేక పరిస్థితుల కారణంగా దాడి వీరభద్రరావుకి టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు సుబ్బారెడ్డి. ఇక షర్మిల కాంగ్రెస్‌లో చేరితే తమకేం ఇబ్బంది లేదన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఇక కాంగ్రెస్‌లో షర్మిల చేరికపై తనకు సమాచారం లేదన్నారు వైవీ సుబ్బారెడ్డి. ఎవరు ఏ పార్టీలో చేరినా తమకు ఇబ్బంది లేదని తెలిపారు. షర్మిలతో కుటుంబపరమైన సంబంధాలు తప్ప.. రాజకీయంగా తాను షర్మిలతో ఎలాంటి రాయబారాలు చేయలేదని అన్నారు.

Shekhar G

Shekhar G

Next Story