RamaChandra Yadav: పుంగనూరు నేతకు వై+ కేటగిరి భద్రత..

RamaChandra Yadav: పుంగనూరులో వైసీపీ అనుచరుల భయానక దాడి తరువాత..

Dhatripriya
Updated on: 21 Jan 2023 1:43 PM IST
Y Plus Security For AP Industrialist Ramachandra Yadav
X

RamaChandra Yadav: ఏపీ పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్‌కు వై ప్లస్ భద్రత

RamaChandra Yadav: ఏపీ యువ నాయకుడు రామచంద్ర యాదవ్ కు కేంద్ర ప్రభుత్వం Y + కేటగిరి భద్రత కల్పించింది. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన రామచంద్ర యాదవ్ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తూ, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే ఏపీలో అధికార పార్టీ అడ్డంకులతో రామచంద్ర యాదవ్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. 2022 డిసెంబర్ 4న సదుంలో రైతుభేరి బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తే.. పోలీసులు దానిని అడ్డుకున్నారు. అదే రోజు తన ఇంటిపై దాడి జరిగింది.

మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే తన ఇంటిపై 300 మంది వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో కేంద్ర బలగాలతో రక్షణ కల్పిస్తామని అమిత్ షా భరోసా ఇచ్చారు. దీంతో తనకు వై ప్లస్ భద్రత మంజూరు చేసిన అమిత్ షాకు రామచంద్ర యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story