అందరి హక్కులు గుర్తు చేసేరోజు

అందరి హక్కులు గుర్తు చేసేరోజు
x
Highlights

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం మనందరి హక్కులను గుర్తు చేసే రోజని విముక్తి కార్యదర్శి శాంతి అన్నారు.

విజయవాడ: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం మనందరి హక్కులను గుర్తు చేసే రోజని విముక్తి కార్యదర్శి శాంతి అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని మంగళవారం స్థానిక గాంధీనగర్‌ హోటల్‌ ఎస్‌.ఎన్‌.ఆర్‌ లో 'హెల్ప్‌' స్వచ్చంద సంస్థ, అక్రమ రవాణా భాదితుల రాష్ట్రస్థాయి ఫోరమ్‌ 'విముక్తి' ఆధ్వర్యంలో బాధిత మహిళలతో సమావేశం జరిగింది. కులం, వర్గం, లింగం, ఆర్థిక పరిస్థితి ఏదైనా సరే, ప్రతి మనిషికి గౌరవం, సమానత్వం, హింస లేకుండా జీవించే హక్కు భాదితులమైన మనకు ఉందని తెలిపారు. అయితే, రాష్ట్రంలో, దేశంలో వేలాది మంది మానవ అక్రమ రవాణాకు గురైన బాధిత మహిళలు, బాలికలు మానవ హక్కులు పొందలేక చీకటిలో మగ్గి పోతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పునరావాసం, రక్షణ, సంరక్షణ పేరుతో బాధిత మహిళలు, బాలికలను షెల్టర్‌ హోమ్‌లో నెలలు, సంవత్సరాల తరబడి ఉంచుతున్నారని అన్నారు. ఇది పునరావాసం కాదు - ఇది వారి తీవ్ర మనోవేదనకు కొనసాగింపు అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మానవ అక్రమ రవాణా బాధితులు ఎదుర్కొంటున్న శారీరక, లైంగిక, మానసిక, ఆర్థిక దోపిడీ అనేది మానవ హక్కుల స్వరూపానికే విరుద్దమైనదని ఆమె బాధ వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అక్రమ రవాణా బాధితులకు నిర్ధిష్టమైన పునరావాసం, నష్టపరిహారం చెల్లించాలని, వారు సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రణాళిక రూపొందించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

విముక్తి కార్యవర్గ సభ్యులు వరలక్ష్మి మాట్లాడుతూ, 2019 నుండి 2023 జూన్‌ వరకు ఆంధ్రప్రదేశ్‌లోని 21 స్వధార్‌ హోమ్స్‌, ఐదు ఉజ్వల హోమ్స్‌లో 2,737 మంది మానవ అక్రమ రవాణా బాధితులను చేర్చినట్లు వివరించారు. కానీ, వీరిలో 80 శాతం మందికి ఎటువంటి పునారావాస కార్యక్రమాలు చేపట్టలేదని, ఇళ్ళ స్థలాల కేటాయించలేదని, రేషన్‌ కార్డులు అందజేయలేదని తెలిపారు. వీరిలో 10 మందికి మాత్రమే నష్టపరిహారం క్రింద జిల్లా న్యాయ సహాయ కేంద్రాల ద్వారా సహాయం అందిందని చెప్పారు. 2,727 మందికి ఎటువంటి నష్ట పరిహారం అందలేదన్నారు. ఈ సమవేశం లో విముక్తి సంయుక్త కార్యదర్శి దుర్గ, కార్యవర్గ సభ్యురాలు అనుష తదితరులు మాట్లాడారు. 40 మంది విముక్తి సబ్యులతో పాటు హెల్ప్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజెర్ ఎస్.పవన్ కుమార్, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వి. భాస్కర్, ప్రాజెక్ట్ కౌన్సిలర్ మెహరున్నీసా తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories