ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్‌లో మహిళ ఉద్యోగికి లైంగిక వేధింపులు...

Women Harassment at Eluru District Register Office | Telugu Online News
x

ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ ఆఫీస్‌లో మహిళ ఉద్యోగికి లైంగిక వేధింపులు...

Highlights

Eluru: లైంగికంగా వేధిస్తున్నాడంటూ దిశ పోలీసులను ఆశ్రయించిన మహిళ ఉద్యోగి...

Eluru: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రిజిస్ట్రార్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఆడిట్ సెక్షన్‌లో అటెండర్‌గా పని చేస్తున్న మహిళ దిశా పోలీసులను ఆశ్రయించింది. జయరాజు అనే వ్యక్తి గతకొద్ది రోజులుగా తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ దిశా పోలీసులను ఆశ్రయించిందామె. జయరాజు వేధింపుల గురించి సదరు మహిళా ఉద్యోగిని జిల్లా రిజిస్ట్రార్‌కి తెలపగా అధికారులు మందలించి వదిలేశారు.

అతని ప్రవర్తనలో మార్పురాకపోగా తన కోరిక తీర్చకపోతే ప్రాణహాని తలపెడతానని బెదిరింపులకు పాల్పడినట్లు సదరు మహిళ చెబుతోంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు దిశా పోలీసులు‌‌. ఆడిట్ సెక్షన్ లో సబ్ రిజాస్టర్ గా ప్రస్తుతం పనిచేస్తున్నాడు. గతంలో మూడేళ్ల క్రితం అతనిపై జంగారెడ్డి గూడెంలో ఏసీబీ కేసు కూడా నమోదైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories