Tirupati: ఏజెంట్‌ రత్నమ్మ చేతిలో మోసపోయిన మహిళ.. రూ.20లక్షలకు అమ్మేశారని ఆరోపణలు!

Tirupati: తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన సులోచన.. ఏజెంట్ రత్నమ్మ చేతిలో మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Arun Chilukuri
Published on: 14 Sept 2022 1:06 PM IST
Women Cheated By An Agent Rathnamma in Tirupati
X

Tirupati: ఏజెంట్‌ రత్నమ్మ చేతిలో మోసపోయిన మహిళ.. రూ.20లక్షలకు అమ్మేశారని ఆరోపణలు!

Tirupati: తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన సులోచన.. ఏజెంట్ రత్నమ్మ చేతిలో మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్సీ కాలనీకి చెందిన తన భార్య సులోచనను స్థానిక ఏజెంట్ రత్నమ్మ ద్వారా మస్కట్ కు పంపించారు. అక్కడికి వెళ్లినప్పటి నుంచి ఆమెను యాజమాని చిత్రహింసలకు గురిచేశాడు. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొంది, ఆ విషయాన్ని సెల్ఫీ వీడియోలో కుటుంబ సభ్యులకు తెలిపారు.

భర్త సుబ్రహ్మణ్యం ఏజెంటు రత్నమ్మను నిలదీయగా తనకేమీ తెలియదని, 2లక్షల రూపాయలు చెల్లిస్తేకానీ సులోచనను తిరిగి తీసుకురాలేమని చెప్పింది. అనంతరం కుటుంబసభ్యులు మస్కట్లో ఉంటున్న యజమానిని అడగ్గా.. సులోచనను రత్నమ్మ రూ.20 లక్షలకు తనకు అమ్మేసిందని.. పంపడానికి కుదరదని తెలిపాడు. ప్రభుత్వం స్పందించి సులోచనను స్వగ్రామానికి తీసుకురావాలని భర్త సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story