Srikakulam: ఇంటి స్థలం కోసం పోరాటం చేస్తున్న ఇద్దరు మహిళలు.. మహిళలను సజీవసమాధికి యత్నం..

Srikakulam: శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో దారుణం చోటు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 7 Nov 2022 3:30 PM IST
Women Attacked and Were Tried to be Buried for Fighting for Land
X

Srikakulam: ఇంటి స్థలం కోసం పోరాటం చేస్తున్న ఇద్దరు మహిళలు.. మహిళలను సజీవసమాధికి యత్నం..

Srikakulam: శ్రీకాకుళం జిల్లా మందస మండలం హరిపురంలో దారుణం చోటు చేసుకుంది. బతికుండగానే ఇద్దరు మహిళలపై ట్రాక్టర్ లోడు కంకర వేసి సజీవ సమాధి చేయబోయిన ఘటన కలకలం రేపింది. కొన్ని సంవత్సరాలుగా ఇంటి స్థలం కోసం తల్లి కూతుళ్లు దాలమ్మ, సావిత్రి పోరాటం చేస్తున్నారు. తమ సొమ్ముతో కొనుకున్న స్థలాన్ని కొందరు కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఆ గ్రామానికి చెందిన కొట్ర రామారావు, ఆనందరావు, ప్రకాష్ రావులు ఈ ఇంటి స్థలాన్ని కబ్జాకు పాల్పడ్డారని తెలుస్తుంది. ఇద్దరు ఆడవాళ్లకు అండగా ఎవరూ లేరని గమనించిన వీరిద్దరిని ట్రాక్టర్ లోడు కంకర వేసి చంపాలని ప్రయత్నించగా స్థానికులు వెంటనే స్పందించి ఆ కంకర ను పారలతో తొలగించి ఇద్దరినీ కాపాడారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story