విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఏడాది పాపను వదిలివెళ్లిన మహిళ...

Vijayawada - Pandit Nehru Bus Stand: పాప ఏడుపు విని చేరదీసిన మహిళా కానిస్టేబుల్...

Shireesha
Updated on: 25 Oct 2021 10:15 AM IST
Woman Leave 1 Year Old Baby Girl At Vijayawada Pandit Nehru Bus Stand | AP Live News
X

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఏడాది పాపను వదిలివెళ్లిన మహిళ...

Vijayawada - Pandit Nehru Bus Stand: విజయవాడలో నిన్న ఉదయం బస్టాండ్‌లో సంవత్సరం వయసున్న పాపను వదిలి వెళ్లిందో మహిళ. అయితే ఆ మహిళ ఎవరన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా.. ఓ మహిళ పాపతో బస్టాండ్‌లో కన్పించినట్లు గుర్తించారు. బస్టాండ్‌లో కలియతిరుగుతూ అక్కడి నుంచి బయటకు వెళ్లినట్లు సీసీ టీవీ ఫుటేజ్‌లో గుర్తించారు. సదరు మహిళ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఏడాది వయసున్న చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. ఏడుస్తూ ఉన్న పాపను గుర్తించిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. మహిళా పోలీసులు పాపను చేరదీసి.. ఆకలి తీర్చారు. అనంతరం చిన్నారిని కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.

Shireesha

Shireesha

Next Story