పెళ్లికి ప్రియుడు నో..కత్తి పట్టిన ప్రియురాలు..!

Woman kills boyfriend in West Godavari
x
Highlights

వారిద్దరూ ఒకరినొకరు నచ్చారు. మనసులు నచ్చాయి. పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్లు ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి జీవించాలనుకున్నారు. పెళ్లి మాట...

వారిద్దరూ ఒకరినొకరు నచ్చారు. మనసులు నచ్చాయి. పరిచయం ప్రేమగా మారింది. మూడేళ్లు ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి జీవించాలనుకున్నారు. పెళ్లి మాట ఎత్తేసరికి యువకుడిలో మార్పు వచ్చింది. అమ్మాయి మీద అబ్బాయికి ప్రేమ తగ్గిందో లేకుంటే వదిలించుకునే ప్రయత్నం చేసుకున్నాడో తెలియదు కానీ, ప్రేమించుకున్నప్పుడు ఉన్న ప్రేమ పెళ్లి మాట ఎత్తే సరికి తగ్గింది. పెళ్లికి నిరాకరించాడు. అంతే అమ్మాయిలో సహానం నశించింది. దాంతో ప్రేమించిన వ్యక్తిని ఈ లోకంలోనే లేకుండ చేసింది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.

ఇలాంటి ఘటనలు సాధరణంగా సినిమాల్లోనే జరుగుతుంటాయి. కానీ, కొవ్వూరు మండల ధర్మవరం- కాపవరం గ్రామాల మధ్య ఇలాంటి ఘటనకు వేదికైంది. తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన పావని, తాడేపల్లిగూడెం పాతూరికి చెందిన తాతాజీ నాయుడు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండేళ్ల నుంచి పెళ్లి చేసుకోవాలంటూ తాతాజీ పై ఒత్తిడి తెచ్చింది పావని.

అయితే పెళ్లికి తాతాజీ నాయుడు నిరాకరించాడు. ఈ క్రమంలోనే సోమవారం మధ్యాహ్నం తాతాజీ బైక్ పై పంగిడి వచ్చాడు. మలకపల్లి నుంచి పావని మాట్లాడేందుకు అతడి దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తిరిగి సాయంత్రం ఆమెను దింపడానికి మలకపల్లి వెళ్తుండగా ద్విచక్ర వాహనంపై వెనకాల నుంచి పావని కత్తి తీసి అతని వీపుపై పొడిచింది. దాంతో ఒక్కసారిగా తాతాజీ నాయుడు కిందపడిపోయాడు వెంటనే మెడ,తల, వీపుపై పొడిచింది. తీవ్ర గాయాలతో తాతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories