Kurnool: నిత్య పెళ్లి కూతురు.. విడాకులు తీసుకోకుండానే మళ్లీ మళ్లీ..

Kurnool: ఓ నిత్య పెళ్లి కూతురు ఏ ఒక్కరికీ విడాకులు ఇవ్వ‌కుండానే మూడు పెళ్లిళ్లు చేసుకుంది.

Arun Chilukuri
Published on: 27 May 2022 3:09 PM IST
Woman Dupes Several Men With Multiple Marriages
X

Kurnool: నిత్య పెళ్లి కూతురు.. విడాకులు తీసుకోకుండానే మళ్లీ మళ్లీ..

Kurnool: ఓ నిత్య పెళ్లి కూతురు ఏ ఒక్కరికీ విడాకులు ఇవ్వ‌కుండానే మూడు పెళ్లిళ్లు చేసుకుంది. ఈమె పేరే శిరీష వ‌య‌సు 24సంవ‌త్స‌రాలు నంద్యాల మండ‌లం మిట్నాల గ్రామంలో త‌ల్లి మేరమ్మతో క‌లిసి ఉంటోంది. శిరీషకు కొంతకాలం క్రితం అవుకుమండలం చెన్నంపల్లెకు చెందిన మల్లికార్జున అనే వ్యక్తితో పెళ్లైంది. కొన్నాళ్లకే భర్తకు దూరంగా వచ్చేసింది. అతడికి విడాకులు ఇవ్వకుండానే బేతంచర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలని భావించింది.

మహేశ్వర్ రెడ్డికి ఇది రెండో వివాహం కావడంతో తనకు ఆర్థిక భద్రత కలిగించేలా రూ.5 లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేయాలని మహేశ్వర్ రెడ్డిని శిరీష కోరింది. ఆయన ఫిబ్రవరి 1న రూ.5 లక్షలు డిపాజిట్‌ చేయగా... ఫిబ్రవరి 5న మద్దిలేటి స్వామి ఆలయంలో వివాహమైంది. అయితే శిరీష తల్లి మేరమ్మ తరచూ ఆర్‌ఎస్‌ రంగాపురం వస్తూ తన కూతురును అత్తారింట్లో ఉంచాలంటే మరిన్ని డబ్బులు, కొంత ఆస్తి రాసివ్వాలని డిమాండు చేయడం ప్రారంభించింది. దీంతో అనుమానం వచ్చిన మహేశ్వరరెడ్డి శిరీష గురించి ఆరా తీయగా షాకింగ్ నిజాలు తెలిశాయి. ఆమెకు గతంలోనే రెండు పెళ్లిళ్లు అయ్యాయని ఇది మూడోపెళ్లని తెలుసుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story