Vizag: ఆర్కే బీచ్‎లో దారుణం.. అర్ధనగ్నంగా యువతి మృతదేహం..

Vizag: విశాఖ బీచ్‌లో వివాహిత డెడ్‌బాడీ కలకలం రేపింది.

Arun Chilukuri
Published on: 26 April 2023 12:21 PM IST
Woman Dead Body Found in Vizag RK Beach
X

Vizag: ఆర్కే బీచ్‎లో దారుణం.. అర్ధనగ్నంగా యువతి మృతదేహం..

Vizag: విశాఖ బీచ్‌లో వివాహిత డెడ్‌బాడీ కలకలం రేపింది. YMCA బీచ్‌లో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతదేహం లభ్యమైంది. మృతురాలు పెదగంట్యాడకు చెందిన శ్వేతగా తెలుస్తోంది. నిన్న సాయంత్రం ఇంట్లోంచి బయటకు వెళ్లింది. రాత్రి అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ కుటుంబసభ్యులు.. పోలీసుల్ని ఆశ్రయించారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తుండగానే స్వాతి ఆర్కేబీచ్‌లో శవమై తేలింది.

అయితే డెడ్‌బాడీ పడి ఉన్న తీరుపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, నిన్న అర్ధరాత్రి సముద్రపు అలల తాకిడి మృతదేహాం కొట్టుకువచ్చినట్టు గుర్తించారు. కానీ, మహిళ మృతదేహాంపై గాయాలు, ఒంటిపై దుస్తులు లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎవరైనా హత్య చేశారా? అని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు.. శ్వేత భర్త ఐటీ ఉద్యోగి. ఆమె 5 నెలల గర్భిణి అని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story