గుంటూరు జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత... వాసిరెడ్డి పద్మను అడ్డుకున్న..

గుంటూరు జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత... వాసిరెడ్డి పద్మను అడ్డుకున్న..
x
వాసిరెడ్డి పద్మ
Highlights

గుంటూరు జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, జనసేన, సీపీఐ, మహిళా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. నిన్న మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన...

గుంటూరు జీజీహెచ్‌ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ, జనసేన, సీపీఐ, మహిళా సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. నిన్న మైనర్‌ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడిని వెంటనే శిక్షించాలని నిందితుడిపై దిశ 2019 చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మైనర్‌ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టారు. జీజీహెచ్‌కు వచ్చిన మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మను టీడీపీ, జనసేన, మహిళా సంఘాల నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గుంటూరు జిల్లా రామిరెడ్డి నగర్‌లో మైనర్ బాలికపై అత్యాచారం చేశాడో ఇంటర్ విద్యార్థి. ఇంటిపై పోర్షన్‌లో ఉంటున్న అతను ఆడుకుంటున్న పాపపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక అనారోగ్యానికి గురికావడంతో ఆరా తీయగా విషయం వెలుగులోకి వచ్చింది. నగరంపాలెం పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories