Srikalahasti: శ్రీకాళహస్తిలో కిలాడీ లేడీ ఘరానా మోసం.. లాడ్జీకి తీసికెళ్ళి..

Srikalahasti: శ్రీకాళహస్తిలో ఓ భక్తుడిని, కుటుంబాన్ని కిలాడీ లేడి ఘరానా మోసం చేసింది.

Arun Chilukuri
Published on: 12 Dec 2022 12:36 PM IST
Woman Cheated Devotee In Srikalahasti
X

Srikalahasti: శ్రీకాళహస్తిలో కిలాడీ లేడీ ఘరానా మోసం.. లాడ్జీకి తీసికెళ్ళి..

Srikalahasti: శ్రీకాళహస్తిలో ఓ భక్తుడిని, కుటుంబాన్ని కిలాడీ లేడి ఘరానా మోసం చేసింది. బస్సులో పరిచయమైన ఓ మహిళ భక్తుడిని, కుటుంబాన్ని లాడ్జికి తీసుకెళ్లింది. ప్రసాదంలో వారికి మత్తు మందు కలిపి ఇచ్చి, 75 తులాల బంగారం, 20 వేల రూపాయల నగదు, ఓ సెల్‌ఫోన్ తీసుకుని పరారైంది. దోచుకెళ్లిన సొత్తు 6 లక్షల రూపాయలు ఉంటుందని బాధితుడు బోరుమన్నాడు. కాగా బాధితుడు హైదరాబాద్ చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. ఘటన జరిగి రెండు రోజులవుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితుడి కుటుంబం ఇంకా లాడ్జిలోనే ఉన్నారు. పరిచయం లేని వ్యక్తుల విషయంలో జాగ్రత్గ ఉండాలిని పోలీసులు పదే, పదే చెబుతున్నా అమాయకులు ఇలా మోసపోతూనే ఉన్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story