సహజీవనం చేస్తున్న వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన వార్డు వాలంటీర్

సహజీవనం చేస్తున్న వ్యక్తి చేతిలో దారుణ హత్యకు గురైన వార్డు వాలంటీర్
x
Highlights

విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యింది. ఓ జర్నలిస్టు సహజీవనం చేస్తున్న మహిళను ఇనుపరాడ్డుతో తలపై మోది హత్య చేశాడు. నర్సీపట్నంలోని 22వ...

విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యింది. ఓ జర్నలిస్టు సహజీవనం చేస్తున్న మహిళను ఇనుపరాడ్డుతో తలపై మోది హత్య చేశాడు. నర్సీపట్నంలోని 22వ వార్డు వాలంటీర్‌గా రెడ్డి దేవి అనే మహిళ పనిచేస్తోంది. భర్త నుంచి విడిపోయింది. ఓ టీవీ చానల్‌ విలేకరిగా పని చేస్తున్న పి.మురళీ(40)తో పరిచయం ఏర్పడింది. నాలుగేళ్లుగా వీరిద్దరూ సహజీవనం సాగిస్తూ పెదబొడ్డేపల్లిలో నివాసం ఉంటున్నారు. మురళీకి వివాహం జరిగింది. భార్య, బాబు ఉన్నారు. దేవి మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుందనే అనుమానం మురళీకి వచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.

ఈ నేపథ్యంలో విధులు ముగించుకుని మంగళవారం దేవి పుట్టింటికి వెళ్లింది. ఈలోపు మురళీ అక్కడకు చేరుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మురళి మద్యం సేవించి తనను ఇబ్బందిపెడుతున్నాడంటూ దేవి పోలీసులకు ఫోన్ చేసింది. దీంతో కోపోద్రేక్తుడైన మురళి పక్కనే ఉన్న ఇనుపరాడ్డుపై ఆమె తలపై బలంగా బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వెంటనే నిందితుడు మురళి స్పాట్ నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా దేవి చనిపోవడంతో ఆమె ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories