Vijayawada: మహిళ హల్‌చల్‌.. ఆవేశంలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి..!

Vijayawada: విజయవాడలో ఓ మహిళ హల్‌చల్‌ చేసింది.

Arun Chilukuri
Published on: 31 July 2022 1:54 PM IST
Woman Attacked on RTC Bus Driver In Vijayawada
X

Vijayawada: మహిళ హల్‌చల్‌.. ఆవేశంలో ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి..!

Vijayawada: విజయవాడలో ఓ మహిళ హల్‌చల్‌ చేసింది. ఆవేశంలో ఊగిపోతూ విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై దాడి చేసింది. ఆమె ఓవరాక్షన్‌కు బస్సులో ఉన్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. నగరంలోని కంట్రోల్‌ రూమ్‌ సమీపంలో ఆర్టీసీ బస్సు తన బైకును ఢీకొట్టిందంటూ సదరు మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో కోపంతో బస్సును ఆపింది. అనంతరం బస్సులోకి వెళ్లి డ్రైవర్‌ను ఎడాపెడా కొడుతూ దూషించింది. ఆయన ఫోన్‌ను తీసుకుంది. ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లగా విచారణ జరుపుతున్నట్టు వారు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story