Sajjala Ramakrishna Reddy: మూడు రాజధానుల ఆకాంక్ష నెరవేరాలని కోరుకున్నా

Sajjala Ramakrishna Reddy: తిరుమల శ్రీవారి సేవలో సజ్జల రామకృష్ణారెడ్డి

Dhatripriya
Published on: 5 Feb 2023 4:06 PM IST
Wish To Fulfill The Wish Of Three Capitals
X

Sajjala Ramakrishna Reddy: మూడు రాజధానుల ఆకాంక్ష నెరవేరాలని కోరుకున్నా 

Sajjala Ramakrishna Reddy: రాష్ట్ర ప్రజల మూడు రాజధానుల ఆకాంక్ష నెరవేరాలని శ్రీవెంకటేశ్వరస్వామిని ప్రార్థించినట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం స్వామివారి నైవేద్య విరామ సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సజ్జల మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ఉండాలని స్వామి వారిని వేడుకున్నట్లు చెప్పారు. అధికార వికేంద్రీకరణ మూడు రాజధానులకు ఆటంకాలు తొలగి పోవాలని, రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలు ఎప్పటికైనా ఇవ్వాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు.

Dhatripriya

Dhatripriya

Next Story