దసరా నాటికి విశాఖపట్నం ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ అయ్యేనా?

దసరా నాటికి విశాఖపట్నం ఎగ్జిక్యుటివ్ క్యాపిటల్ అయ్యేనా?
x
Highlights

విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ఎప్పుడు మారనుంది ? ప్రభుత్వం అనుకున్నట్లుగా దసరా నాటికి విశాఖ పట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ అనిపించుకుంటుందా?...

విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ఎప్పుడు మారనుంది ? ప్రభుత్వం అనుకున్నట్లుగా దసరా నాటికి విశాఖ పట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ అనిపించుకుంటుందా? ఇటువంటి పలు అనుమానాలు ప్రస్తుతం వ్యక్తం అవుతున్నాయి. రాజధానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లను రోజువారి విచారణ చేయాలని హైకోర్టు నిర్ణయించింది. దీంతో మరోసారి కార్యనిర్వాహక రాజధాని అంశం చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని అమరావతి ప్రాంతంతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా అభివృద్ధి చెందేలా పరిపాలనా వికేంద్రీకరణకు సీఎం జగన్ సిద్ధపడ్డారు. సీఎం నిర్ణయాన్ని టీడీపీతో పాటు పలు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం మాత్రం రాజధాని తరలింపు ప్రక్రియను చాపకింద నీరులా చేపడుతోంది. విశాఖను పరిపాలనా రాజధానిగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో పనులు నెమ్మదించాయి.

రాజధానికి సంబందించిన 229 పిటీషన్స్ కోర్టు పరిశీలనలో ఉన్నాయి. వీటీని రెండు వర్గాలుగా విభజించి విచారించనున్నారు. 'వీవీఐపీలు, వీఐపీలకు గెస్ట్‌హౌ్‌సలు' పేరుతో విశాఖలో 30 ఎకరాల్లో భారీ ప్రాజెక్టును ప్రభుత్వం ప్లాన్ చేస్తుందన్నసమాచారంపై ధాఖలయిన పిటీషన్‌ను కోర్టు విచారించనుంది. విశాఖలో గెస్ట్ హౌస్‌ నిర్మాణం కోర్టు ధిక్కరణపై సీఎస్‌ సంతకంతో కౌంటర్‌ దాఖలు చేయాలని గతంలో ధర్మాసనం ఆదేశించింది. దీనిపై ఉత్కంఠత కొనసాగుతంది. విశాఖలో రాజధాని నిర్మాణం వల్ల పెద్దగా ఉపయోగం లేదని జనసేన నేత బోలేశెట్టి సత్యనారాయణ అన్నారు. ఆదాయ వనరులు పెంచే మార్గాలపై ప్రభుత్వం ఫోకస్‌ చేయాలని సూచించారు. దసరా నాటికి రాజధాని ముహూర్తం ఖరారౌతుందని విశాఖ వాసులు భావించారు. కోర్టులో విచారణ పూర్తయ్యే వరకూ ఆ శుభముహూర్తం రాకపోవచ్చు. దీనిపై క్యాపిటల్‌పై ఉత్కంఠ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories