Steel Plant: స్టీల్ ప్లాంట్ పై మరో బాంబు పేల్చిన కేంద్రం

Will Shutdown Steel Plant if no One Comes to Buy says, Anurag Thakur
x

స్టీల్ ప్లాంట్ పై మరో బాంబు పేల్చిన కేంద్రం

Highlights

Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం ఏపీలో ఉధృతంగా సాగుతున్న సమయంలో కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ప్రైవేటీకరణ ఆగేది లేదని తేల్చి చెప్పేస్తోంది....

Steel Plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం ఏపీలో ఉధృతంగా సాగుతున్న సమయంలో కేంద్రం సంచలన ప్రకటన చేసింది. ప్రైవేటీకరణ ఆగేది లేదని తేల్చి చెప్పేస్తోంది. ఎవరు ఆందోళనలతో తమకు సంబంధం లేదని స్పష్టంగా సంకేతాలు ఇస్తోంది. దేశంలో ప్రైవేటీకరించాలనుకున్న ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రానిపక్షంలో వాటిని మూసివేయ డానికి కూడా సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉక్కు కర్మాగారాలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాజ్యసభలో భాజపా ఎంపీ సస్మిత్‌ పాత్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

దేశంలోనే 5 ఉక్కు పరిశ్రమలను ఐదేళ్లలో ప్రైవేటీకరించేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పారు. ఉక్కు పరిశ్రమలను కొనేందుకు ఎవరూ ముందుకు రాని పక్షంలో వాటిని మూసేస్తామని స్పష్టం చేశారు. ఉక్కు తయారీ రంగం నాన్ స్ట్రాటెజిక్ పరిధిలోకి వస్తుందని ఈ విభాగంలోకి వచ్చే అన్ని పరిశ్రమలను ప్రైవేటీకరిస్తామని చెప్పారు. ప్రభుత్వ రంగానికి చెందిన సంస్థలు, బ్యాంకులు, బీమా సంస్థలకు కూడా ఇది వర్తిస్తుందని అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories