వంశీ ఐయామ్‌ సారీ అన్నారు.. కొడాలి ఊచకోత ఆపుతారా?

Will Kodali Nani Says Sorry to Chandrababu
x

వంశీ ఐయామ్‌ సారీ అన్నారు.. కొడాలి ఊచకోత ఆపుతారా?

Highlights

Kodali Nani: వంశీ వైండప్‌ అయ్యారు. ఐయామ్‌ సారీ అనేశారు.

Kodali Nani: వంశీ వైండప్‌ అయ్యారు. ఐయామ్‌ సారీ అనేశారు. ఏదో పొరపాటున నోరు జారానని పశ్చాత్తాపపడ్డారు. అయిందేదో అయింది ఇకపై అనను అంటూ క్షమాపణ కోరారు. ఇక్కడితో వంశీ తిట్ల ఎపిసోడ్‌ ఆగిందనే అనుకుందాం. మరి నాని సంగతేంటి? తెలుగుదేశం అన్నా మరీ ముఖ్యంగా చంద్రబాబు అన్నా ఒంటికాలు మీద లేచి ఎక్కి తొక్కే కొడాలి ఊచకోత మాటేమిటి? వంశీపై ఒత్తిడి తెచ్చి మెడలు వంచిన ఆ వర్గమే నానిని కూడా వెంటాడుతుందా? వంశీ ఎపిసోడ్‌లో ఏం జరిగింది? కొడాలి విషయంలో ఏం జరగబోతోంది?

కొడాలి శ్రీ వేంకటేశ్వరరావు. అలియాస్‌ కొడాలి నాని. మాటలు మాట్లాడితే అణుబాంబులు పేలుతాయి. పంచ్‌లు విసిరితే పంచెలు తడిసిపోతాయి. ప్రత్యర్థి పార్టీ ఎవరైనా ప్రత్యర్థి నాయకుడు ఎవరైనా నాని డిసైడ్‌ అయితే, వార్‌ వన్‌సైడ్‌గానే సాగుతుంది. అవతలి నుంచి మాటల్లేవ్‌ మాట్లాడుకోవాడల్లేవ్‌. అన్నట్టుగా సీన్‌ క్రియేట్‌ చేస్తారు. స్క్రీన్‌ అంతా తానే అయి నడిపిస్తారు. ఊచకోతకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న కొడాలి నాని చంద్రబాబు ఎపిసోడ్‌లో తీసుకునే నిర్ణయం ఏంటి? ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా నడుస్తోంది.

గన్నవరం తెలుగుదేశం రెబెల్‌ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలానే ఒత్తిడితో బైండ్ఓవర్‌ అవుతారా? ఇంకా బెండ్‌ తీస్తారా? పెద్ద ఎన్టీఆర్‌ మీద అపారమైన ప్రేమాభిమానాలు కురిపించే కొడాలి నాని, నందమూరి వంశానికి వీర విధేయుడు. నందమూరి హరికృష్ణకు నమ్మిన బంటుగా తెలుగుదేశం తెర మీదికి వచ్చిన నాని ఆయన తర్వాత అంతటి ప్రేమాభిమానాలను ఆయన తనయుడు చిన్న ఎన్టీఆర్‌ మీద కురిపిస్తూ ఉంటారు. 2019లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత చెలరేగిపోయిన నాని చంద్రబాబును ఒక దశలో ఊచకోత కోసినంత పని చేశారు. ఇంచు ఇంచుకో పంచ్‌ వేస్తూ పంచెలు తడిపించినంత పని చేశారు. ఇదే చంద్రబాబుకు మనస్తాపం కలిగించిందట. కంట కన్నీరు తెప్పించిందట.

అయితే, చంద్రబాబు ఎపిసోడ్‌కు నాంది పలికిన వల్లభనేని వంశీ ఆ తర్వాత తగ్గారు. మెట్టు కాదు మెట్లు దిగి వచ్చి ఐయామ్‌ సారీ అన్నారు. ఏదో పొరపాటున నోరుజారానంటూ కవరింగ్‌ ఇచ్చుకున్నారు. ఇది ఇలా జరగడానికి, వంశీ తగ్గడానికి ఓ వర్గం నేతల ఒత్తిడే కారణమట. కుల సమీకరణలే వంశీతో సారీ చెప్పించాయట. సేమ్‌ టు సేమ్‌ సీన్‌ రేపు కాకపోయినా ఎల్లుండి అయినా కొడాలి వైపు మళ్లుతుందంటున్నారు విశ్లేషకులు. చంద్రబాబు సామాజిక వర్గం పెద్దలు నానితో మాట్లాడి సారీ చెప్పిస్తారన్న ప్రచారం జరుగుతుంది. ఇదే కంటిన్యూ అయితే, తమ కులం నుంచి వచ్చే వ్యతిరేకతను తట్టుకోవడానికి వంశీ ఎలాగైతే సారీ చెప్పారో కొడాలి నాని కూడా అదే బాటలో నడవక తప్పదన్న టాక్‌ వినిపిస్తోంది.

అదీగాక, చంద్రబాబు భార్య భువనేశ్వరికి మేనల్లుడు, కొడాలి అమితంగా ఆరాధించే జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా నాని మీద ఒత్తిడి తీసుకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఎపిసోడ్‌ తర్వాత ఏకమైన నందమూరి కుటుంబ సభ్యులు కొడాలి నాని మీద, వల్లభనేని వంశీ మీద విరుచుకుపడ్డారు. నోటికొచ్చినట్టు మాట్లాడి తప్పు చేశారంటూ మండిపడ్డారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా కర్ర విరగకుండా, పాము చావకుండా ఓ వీడియో రిలీజ్‌ చేసి చేతులు దులుపుకున్నారన్న చర్చ జరిగింది. జూనియర్‌ వీడియో మీద తెలుగుదేశం క్యాంప్‌లో కూడా ఎన్నో చర్చలు, జరిగాయి. తనకు వ్యతిరేకంగా తన సామాజికవర్గం పావులు కదిపితే కష్టమని జూనియర్‌ కూడా భావించి ఉంటారని, పనిలో పనిగా వంశీకి, కొడాలికి ఎన్టీఆర్‌ హితోపదేశం చేసి ఉంటారన్న టాక్‌ వినిపిస్తోంది. ఏమైనా ఏది నిజమైనా వంశీ తగ్గినట్టే రేపు రేపు కొడాలి కూడా సారీ చెబుతారేమో చూడాలి. కాకపోతే, చంద్రబాబు అంటే పీకల దాక కసి పెంచుకున్న కొడాలి ఏ మేరకు తగ్గుతారన్నదే అసలు సిసలు ప్రశ్న.

Show Full Article
Print Article
Next Story
More Stories