Chandrababu: అనుమానం వద్దు... కుప్పం నుంచే పోటీ..

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజకీయ ఎదుగుదలకు సాక్షీభూతంగా నిలిచింది కుప్పం నియోజకవర్గం.

Arun Chilukuri
Updated on: 14 May 2022 3:53 PM IST
Chandrababu: అనుమానం వద్దు... కుప్పం నుంచే పోటీ..
X

Chandrababu: అనుమానం వద్దు... కుప్పం నుంచే పోటీ.. 

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజకీయ ఎదుగుదలకు సాక్షీభూతంగా నిలిచింది కుప్పం నియోజకవర్గం. ఒక్కో ఎన్నికలో భారీ మెజార్టీతో గెలుస్తూ కుప్పం రికార్డులను చంద్రబాబు చెరిపివేశారు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయిపోయింది. స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయంతో చంద్రబాబుకు మైండ్ బ్లాంక్ అయ్యింది. సొంత ఇలాకాలో పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఏమవుతోందోనన్న వర్రీ వెంటాడింది.

ఇలాంటి తరుణంలో కుప్పం నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటించారు చంద్రబాబు. తాను కుప్పం నియోజకవర్గాన్ని వదలేది లేదని ప్రజల్లోనే ఉంటానన్న భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లోనూ కుప్పం నుంచి పోటీ చేస్తానని వైసీపీని చిత్తుగా ఓడిస్తామంటూ పిలుపునిచ్చారు. మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించిన చంద్రబాబు టీడీపీ కేడర్‎లో జోష్ నింపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story