Top
logo

చిరుపై ఆ ప్రచారంలో నిజమెంత.. ఏకంగా కేంద్రమంత్రిని చేస్తుందా?

చిరుపై ఆ ప్రచారంలో నిజమెంత.. ఏకంగా కేంద్రమంత్రిని చేస్తుందా?
X
Highlights

మెగాస్టార్‌ చిరంజీవి, రాజకీయాల్లోకి రానురాను అంటున్నారు. అయినా వైసీపీ రాజ్యసభ ఇస్తుంది, కేంద్రమంత్రిని...

మెగాస్టార్‌ చిరంజీవి, రాజకీయాల్లోకి రానురాను అంటున్నారు. అయినా వైసీపీ రాజ్యసభ ఇస్తుంది, కేంద్రమంత్రిని చేస్తుందంటూ, ప్రచారం జెట్‌ స్పీడ్‌లో సాగుతోంది. పాలిటిక్స్‌లో రీఎంట్రీ ఇవ్వనంటున్నా, ఇలాంటి ప్రచారం ఎందుకు జరుగుతోంది? దీని వెనక అసలు కథేంటి? చిరంజీవి మదిలో ఏముంది?

రాజకీయాల్లోకి రానంటున్నా చిరుపై కొత్తకొత్త పుకార్లేంటి? వైసీపీ రాజ్యసభ ఇస్తుందని, కేంద్రమంత్రి అవుతారని ప్రచారమేంటి? ఈ పుకార్లు, షికార్ల వెనక అసలు కథ వేరే వుందా?రాజకీయాలపై చిరంజీవి మదిలో అసలేముంది?

చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించడం, 2009లో పోటీ చేయడం, ఆ తర్వాత కాంగ్రెస్‌లో పార్టీని విలీనం చెయ్యడం, ఆ తర్వాత చిరంజీవి కాంగ్రెస్‌కు దూరం కావడం, సినిమాలపై పూర్తిగా దృష్టిపెట్టడం వంటి పరిణామాలు చూశాం. చిరంజీవి ప్రశాంతంగా సినిమాలు చేస్తున్న ఇలాంటి సమయంలో, మరోసారి ఆయన పొలిటికల్ రీఎంట్రీపై జరుగుతున్న ప్రచారం, వాడివేడి చర్చకు దారి తీస్తోంది.

కొంతకాలంగా చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఆంధ‌్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను చిరంజీవి కలవడం, మూడు రాజధానులకు అనుకూలంగా చిరు ప్రకటన విడుదల చేయడంతో, ఈ ఊహాగానాలకు మరింత బలం తోడైంది. పవన్‌కు చెక్‌ పెట్టేందుకు జగన్‌ చిరును ప్రయోగిస్తారని, కాపు ఓట్లు చెక్కుచెదరకుండా, వైసీపీ వైపే వుండేలా చిరుకు అధిక ప్రాధాన్యమిస్తారన్న మాటలూ వినిపించాయి. అందులో భాగంగానే, చిరంజీవికి రాజ్యసభ పదవి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఎన్డీయేలో వైసీపీ చేరుతుందని, చిరంజీవికి కేంద్రమంత్రి పదవి కూడా ఇస్తారన్న ఊహాగానం చక్కర్లు కొడుతోంది. కానీ దీనిపై చిరంజీవి అస్సలు రియాక్ట్‌ కాలేదు ఇప్పటి వరకు.

మరి ఈ ప్రచారంలో నిజమెంత? నిజంగా చిరుకు వైసీపీ రాజ్యసభ ఇస్తుందా? ఏకంగా కేంద్రమంత్రిని చేస్తుందా?

రాజకీయాల్లో బాగా ఇబ్బందిపడి, చిరంజీవి పక్కకు వెళ్లిపోయారు. సైరా ప్రమోషన్స్‌లో భాగంగా అమితాబ్‌ ఇంటర్వ్యూలోనూ, తాను రాజకీయాల్లోకి వెళ్లి చాలా చింతిస్తున్నానని అన్నారు చిరంజీవి. గతంలో తన ఆంతరంగీకులతో, సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడినప్పుడు, తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పాలిటిక్స్‌లోకి రానని చెప్పారు. పదేళ్ల పాటు సినిమాలు తీసి, తర్వాత రిటైర్‌ అవుతానని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సినీ పరిశ్రమకు అందుబాటులో వుంటానన్నారు. పరిశ్రమ ప్రతిష్ట మరింత పెరగడానికి తనవంతు కృషి చేస్తాననన్నారు. చిన్నదైనా, పెద్దదైనా, ఇండస్ట్రీకి సంబంధించిన ఎలాంటి కార్యక్రమమైనా తాను పాల్గొంటానని తెలిపారు. చిరు తన మాటలకు అనుగుణంగానే, మాలో జరిగిన అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీలో దాసరి నారాయణ రావులేని లోటును తీర్చాలని భావిస్తున్నారట చిరంజీవి.

రాజకీయాలకు చిరంజీవి దూరంగా ఉంటున్నప్పటికీ, రాజకీయపరమైన కొన్ని అంశాల్లో తన అభిప్రాయాలను మాత్రం వెల్లడిస్తున్నారు. మూడు రాజధానులపై అటు కాంగ్రెస్‌, ఇటు జనసేన, మరోవైపు బీజేపీ, టీడీపీలు వ్యతిరేకిస్తున్నా, తాను మాత్రం మద్దతు పలికారు. పాలనా వికేంద్రీకరణతోనే అభివృద్ది సాధ్యమని విస్పష్టంగా ప్రకటించారు. తమ్ముడు పవన్‌ కల్యాణ్‌కు ఈ పరిణామంతో కాస్త ఇబ్బంది కలిగినా, తన అభిప్రాయాన్ని మాత్రం నిర్మోహమాటంగా చెప్పారు చిరంజీవి.

రాజకీయాల్లో ప్రత్యక్షంగా లేకపోయినా, సబ్జెక్ట్‌ను బట్టి మద్దతివ్వాలని భావిస్తున్నారట చిరంజీవి. ఇందులో మెగాస్టార్‌కు మెగా వ్యూహముందన్న చర్చ కూడా జరుగుతోంది. అంశాలవారీగా సపోర్ట్‌ ఇవ్వడంలో తనకంటూ ఒక ఆలోచన వుందట. మెగా కాంపౌండ్‌లో హీరోలు చాలామంది వున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మెగా హీరోల సినిమాల మార్కెట్‌ చాలా ఎక్కువ. రెండు ప్రభుత్వాలతోనూ ఫ్రెండ్లీగా వుంటేనే మంచిదన్నది చిరు లెక్క. అంతేకాదు, తన వియ్యంకులైన అపోలో హాస్పిటల్స్‌ అధినేత ప్రతాప్‌ సి.రెడ్డి కుటుంబానికి సైతం పరోక్షంగా రాజకీయ సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో అనివార్యంగానైనా, పాలిటిక్స్‌తో పరోక్షంగా సంబంధాలుండాలని చిరంజీవి ఆలోచిస్తున్నారట. దీనికితోడు ఏపీలో బలమైన సామాజికవర్గం నాయకుడు కాబట్టి, ఇన్‌డైరెక్టుగా పాలిటిక్స్‌లో వుండాలని అనుకుంటున్నారట. అంతేకానీ, ప్రత్యక్షంగా తిరిగి రాజకీయాల్లో చక్రంతిప్పాలని మాత్రం, చిరంజీవికి లేదట. కానీ ప్రచారం మాత్రం, రాజ్యసభను దాటి కేంద్రమంత్రిని టచ్‌ చేస్తోంది.

పవన్‌ను ఇబ్బంది పెట్టడానికే అదేపనిగా చిరు నామస్మరణా? పవన్‌ వ్యతిరేకులే చిరుపై ప్రచారం చేస్తున్నారా?

చిరు ప్రమేయం లేకుండా, ఆ‍యన పొలిటికల్ రీఎంట్రీపై జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తుంటే, ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వస్తోంది. పవన్‌ను మానసికంగా దెబ్బకొట్టడానికి చిరు పేరును అదే పనిగా తెరపైకి తెస్తున్నారన్న చర్చ జరుగుతోంది. కాపువర్గం మొత్తం పవన్‌ వైపు మళ్లకుండా, మెగాస్టార్‌ పేరుతో కట్టడి చెయ్యాలనుకుంటున్నారన్న మాటలు వినపడ్తున్నాయి.

మొత్తానికి చిరంజీవి పొలిటికల్‌ రీఎంట్రీ ఇవ్వరని, ఆయన సన్నిహితులు స్పష్టాతిస్పష్పంగా చెబుతున్నారు. అసలు ఆ‍యనకు ఆ ఉద్దేశమే లేదంటున్నారు. అంతేకాదు, వైసీపీ సైతం చిరుకు, రాజ్యసభ ఎందుకిస్తుందని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎన్డీయేలో వైసీపీ చేరడం కూడా పెద్ద పుకారేనంటున్నారు. కానీ పవన్‌ను ఇబ్బందిపెట్టడానికో, లేదంటే పరిస్థితులు అలా కన్నిస్తున్నాయనో, చిరంజీవిపై అదే పనిగా ప్రచారం జరుగుతోందని, మెగా సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్కటి మాత్రం వారు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు చిరంజీవికి ప్రస్తుతం రాజకీయాలపై ఎలాంటి ఆసక్తీలేదని.Web TitleWill chiru make his re entry into politics?
Next Story