పార్టీపై పట్టు బిగించేలా బాలయ్య పావులు.. బాలయ్య నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలు?

Will Balakrishna As The CM Candidate In 2024 Elections
x

పార్టీపై పట్టు బిగించేలా బాలయ్య పావులు.. బాలయ్య నాయకత్వంలోనే వచ్చే ఎన్నికలు?

Highlights

Balakrishna: తెలుగు తమ్ముళ్లు అఖండ జాతరలో మునిగి తేలుతున్నారా? బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో టీడీపీ క్యాంప్‌ సంబరాలు చేసుకుంటుందా?

Balakrishna: తెలుగు తమ్ముళ్లు అఖండ జాతరలో మునిగి తేలుతున్నారా? బ్లాక్‌బస్టర్‌ హిట్‌తో టీడీపీ క్యాంప్‌ సంబరాలు చేసుకుంటుందా? నందమూరి నట వారసత్వాన్ని బ్రాండ్‌ చేసి బాక్సాఫీస్‌ బద్దలు కొట్టిన బాలయ్యతో పొలిటికల్‌గా నందమూరి స్కెచ్‌‌ను వేయించాలని చూస్తున్నారా? పార్టీ సారథ్య బాధ్యతలు బాలకృష్ణ భుజాన పెట్టాలని చూస్తున్నారా? వచ్చే ఎన్నికలే టార్గెట్‌ పావులు కదుపుతున్న చంద్రబాబు ఈసారి బాలయ్యను ముందు పెట్టి కథ నడిపించగలరా? పార్టీ ఒప్పుకుంటుందా? ఒప్పించేలా నిర్ణయం తీసుకుంటారా? తెలుగుదేశం క్యాంప్‌లో జరుగుతున్న ఓ తాజా చర్చపై జరుగుతున్న రచ్చేంటి?

నందమూరి నట సింహం గర్జించిన అఖండ సినిమా హిట్‌తో తెలుగుదేశం క్యాంప్‌లో సరికొత్త చర్చ జరుగుతోందట. అఖండ సినిమా హిట్‌తో బాలయ్యతో పార్టీపై పట్టు బిగించేలా కొందరు హార్డ్‌కోర్‌ కార్యకర్తలు పావులు కదుపుతున్నారట. బాలయ్యకు ఉన్న వ్యక్తిగతమైన పలుకుబడి, ప్రజల్లో ఉన్న ఇమేజ్‌ అలాంటిదని ఉదహరిస్తున్న తెలుగు తమ్ముళ్లు వచ్చే ఎన్నికలకు బాలయ్య నేతృత్వంలో వెళ్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో పడ్డారట. ఎలాగైనా అధినేతను ఒప్పించి, ఆయన్ను మెప్పించి నందమూరి నట సింహాన్ని ఎన్నికల బరిలో ముందుంచాలని అనుకుంటున్నారట.

నిజానికి, బాలయ్య ఇమేజే వేరు. ఆయనకున్న పరపతే వేరు. 2019 ఎన్నికల్లో ఏపీ అంతా వైసీపీ ఫ్యాన్ గాలి బాగా వీచిన కానీ, దానిని తట్టుకొని నిలబడి, టీడీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. అనంతపురం జిల్లాలో నందమూరి ఫ్యామిలీకి పెట్టని కోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీచేసిన బాలయ్య మంచి మెజారిటీతో విజయం సాధించారు. హిందూపురంలో మరోసారి నందమూరి పట్టు, తెలుగుదేశం హవా గట్టిగానే ఉందని నిరూపించారు. అయితే, వైసీపీ శ్రేణులు బాలయ్యను రాజకీయంగా లైట్‌ తీసుకుంటున్నా మొన్నటి చంద్రబాబు ఏడుపు ఎపిసోడ్‌తో ఘాటు వ్యాఖ్యలతో తన పెతామేంటో మరోసారి చూపించిన బాలయ్య జగన్‌ సర్కార్‌కు వార్నింగ్‌ ఇచ్చారు.

జగన్‌ సర్కార్‌కు ఇచ్చిన హెచ్చరికలను మనసులో పెట్టుకున్న వైసీపీ నేతలు అఖండ సినిమా రిలీజ్‌‌ను అడ్డుకున్నారట. చంద్రబాబు ఎపిసోడ్‌ తర్వాత బాలయ్య మీద గుర్రు మీదున్న వైసీపీ శ్రేణులు అఖండ సినిమా విషయంలో కాస్త అటుఇటూగానే ఉన్నారట. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి టీడీపీ నేతల టార్గెట్‌గా వేడెక్కతున్న రాజకీయాన్ని మరింత కాగేలా చేశారట. బాలకృష్ణ చంద్రబాబుకు వియ్యంకుడు. బావమరిది కూడా. మొదట్లో బాలకృష్ణని జగన్ ప్రభుత్వం ఎక్కడా టార్గెట్‌ చేయలేదు. బాలయ్యని వైసీపీ నేతలు పెద్దగా విమర్శించిన సందర్భాలు కూడా లేవు. ఇదంతా గతం. కానీ ఇప్పుడు బాలయ్య విషయంలో సీన్‌ మారిందన్న చర్చ జరుగుతోంది. అఖండ సినిమా గుడ్‌ టాక్‌ రావడంపై సంబరాలు చేసుకుంటున్న తెలుగు తమ్ముళ్లు ఎలాగైనా బాలయ్యను ఒప్పించి, ఈసారి ఎన్నికలకు ఆయన నేతృత్వంలోనే వెళ్లే ప్లాన్‌ చేస్తున్నట్టు సమాచారం.

ఒకవైపే చూడు ఇంకో వైపు చూడకు అన్న తన సినిమా డైలాగ్‌నే బాలయ్య వినిపించబోతున్నారట. ఇప్పటికే బావ డైరెక్షన్‌లో తెలుగుదేశం పార్టీ సంస్థాగతంలో పటిష్టం కావడానికి కసరత్తు మొదలు పెట్టారట. ఈ క్రమంలో ఇక వచ్చే ఎన్నికల నాటికి సమాయత్తం కావడానికి ఇప్పటినుంచే పార్టీని పటిష్టం చేయడంపై చంద్రబాబు సూచనన మేరకు దృష్టి పెట్టారట. యాక్టివ్‌గా లేని పార్టీ ఇన్‌ఛార్జిలకు స్పెషల్‌ ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చారట. ఆసక్తి లేని పార్టీ ఇన్‌ఛార్జిల స్థానంలో ఔత్సాహికులకు అవకాశం కల్పించాలని, మూస పద్ధతులకు, పాత విధానాలకు స్వస్తి పలికేందుకు బాలయ్య క్యాడర్‌కు మార్గనిర్దేశనం చేస్తున్నారని సమాచారం. మరి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని సంస్థాగతంగా తయారు చేయడంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తన బావమరిది, నందమూరి రాజకీయ వారసుడిగా బాలయ్యను ఎలా ప్రపోజ్‌ చేస్తారో ఎలా ప్రమోట్‌ చేస్తారో బాలయ్య స్టెప్పేంటో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories