Visakhapatnam: భర్త అదృశ్యం అంటూ కంప్లైంట్.. ప్రియుడితో కలిసి..

Visakhapatnam: విశాఖ మధురవాడలో దారుణం చోటుచేసుకుంది. భర్తను ప్రియుడుతో కలిసి భార్య హతమార్చింది.

Arun Chilukuri
Updated on: 21 July 2022 6:00 PM IST
Wife Killed Husband With Help Of Lover in Vizag
X

Visakhapatnam: భర్త అదృశ్యం అంటూ కంప్లైంట్.. ప్రియుడితో కలిసి..

Visakhapatnam: విశాఖ మధురవాడలో దారుణం చోటుచేసుకుంది. భర్తను ప్రియుడుతో కలిసి భార్య హతమార్చింది. సౌత్ ఆఫ్రికాలో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ప్రొఫెసర్‌గా మురళి పని చేస్తున్నారు. ఇటీవలే పీఎం పాలెం పోలీసు స్టేషన్‌లో మిసింగ్ కేసుగా భార్య మృదుల పిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి.

ఈనెల 9న మురళి ఆఫ్రికా నుంచి విశాఖ చేరుకున్నాడు. రెండు రోజులు ఇంట్లోనే ఉన్నాడు. 11న శ్రీకాకుళం జిల్లా పిల్లలవలస గ్రామంలో ఉన్న తన తల్లిని కలవడానికి కొమ్మాదిలో భర్తను డ్రాప్ చేసింది మృదుల. అప్పటి నుంచి భర్త కనించడం లేదని మృదుల పిర్యాదులో పెర్కొంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు తమదైన స్టయిల్‌లో విచారణ చేపట్టారు. వివాహేతర సంబంధం కోణంలో మృదులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో మర్డర్‌ స్కెచ్ బయటపడింది. ప్రియుడి సహాయంతో భర్తను హత్య చేసినట్టు విచారణలో అంగీకరించింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story