AP News: మొదటి భార్య రీల్స్ చూస్తున్నాడని.. భర్త మర్మాంగాలను కోసేసిన రెండో భార్య

మనస్పర్ధలతో భర్తలపై భార్యల దాడులు నిన్న భర్త నాలుక కొరికేసిన భార్య

Shekhar G
Updated on: 22 July 2023 1:25 PM IST
Wife Cut Her Husbands Private Parts for Watching the Reels of the First Wife
X

AP News: మొదటి భార్య రీల్స్ చూస్తున్నాడని.. భర్త మర్మాంగాలను కోసేసిన రెండో భార్య

AP News: భార్యభర్తల మధ్య గొడవలు శృతిమించుతున్నాయి. ఒకప్పుడు గొడవలు జరిగితే భార్యలపై దాడులంటూ వార్తలు వచ్చేవి. కాని ఇప్పుడు కాలం మారింది. భర్తలపై భార్యలు దాడులు చేయడం మాత్రమే కాదు. ఏది దొరికితే అది కోసేస్తూ ప్రాణాలు సైతం తీసేస్తున్నారు. రెండ్రోజుల వ్యవధిలోనే భర్తలపై భార్యలు చేసిన దాడుల ఘటనలు రెండు వెలుగులోకి వచ్చాయి.

నిన్న కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎ‌ల్లంగుట్ట తండాలో భర్త నాలుకను భార్య కొరికేసింది. గుంటూరు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్‌... కర్నూలు జిల్లా తుగ్గలి మండలానికి చెందిన మహిళను 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. శుక్రవారం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలోనే భర్త నాలుకను భార్య కొరికేసింది. తనకు ఇష్టం లేదని చెబుతున్నా ముద్దు పెట్టేందుకు ప్రయత్నించడాని అందుకే కొరికేసినట్లు భార్య పుష్పవతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇటు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మరో ఘాతుకం వెలుగులోకి వచ్చింది. మొదటి భార్య రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాగాన్ని కోసేసింది రెండో భార్య. ముప్పాళ్ల గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబు.. మొదటి భార్యతో గొడవల కారణంగా విడిపోయాడు. ఐదేళ్ల క్రితం వరమ్మ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. నిన్న రాత్రి మొదటి భార్య రీల్స్ ఎందుకు చూస్తున్నావని ఆనంద బాబును వరమ్మ ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే బ్లేడ్‌తో భర్త మర్మాగాన్ని కోసేసింది. తీవ్ర రక్తశ్రావం కావడంతో ఆనంద్ బాబును నందిగామ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించి చికిత్స అందిస్తున్నారు.

Shekhar G

Shekhar G

Next Story