ఫైర్‌బ్రాండ్‌ అనిత ఎందుకు సైలెంటయ్యారు..కొత్త బాట పట్టబోతున్నారా?

ఫైర్‌బ్రాండ్‌ అనిత ఎందుకు సైలెంటయ్యారు..కొత్త బాట పట్టబోతున్నారా?
x
Highlights

అనితా ఓ అనితా అదిరిపోయే పంచ్‌లు విసిరే వనితా. అనితా ఓ అనితా అసెంబ్లీలో దుమ్మురేపిన వనిత. అనితా ఓ అనితా రోజాతో కయ్యమాడే వనిత. ఇప్పుడెక్కడున్నారు ఆ ఘనత...

అనితా ఓ అనితా అదిరిపోయే పంచ్‌లు విసిరే వనితా. అనితా ఓ అనితా అసెంబ్లీలో దుమ్మురేపిన వనిత. అనితా ఓ అనితా రోజాతో కయ్యమాడే వనిత. ఇప్పుడెక్కడున్నారు ఆ ఘనత వహించిన అనిత. ఓటమితో కలత చెందారా లేదంటే కండువా మార్చే పనిలో ఉన్నారా అనిత.

ఆమె ఒకప్పుడు ఫైర్ బ్రాండ్.అసెంబ్లీ లోపలా, బయటా ధాటిగా మాట్లాడిన లీడర్. అత్యంత వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన టీడీపీ మహిళా నేత. ముఖ్యంగా రోజాపై చెలరేగిన నాయకురాలు. మరి ఇప్పుడెందుకు సైలెంటయ్యారు. ఓడిపోయినందుకు మౌనందాల్చారా. లేదంటే మరో పార్టీలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నారా. అనిత ఏమయ్యారు.

విశాఖ వనిత వంగలపూడి అనిత. రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక నేతగా ఎదిగారు. ఓ చిన్న ప్రభుత్వ ఉద్యోగిగా మొదలైన ఆమె ప్రస్థానం, అసెంబ్లీలో అధ్యక్షా అనే వరకు సాగింది.

టీడీపీ అభ్యర్థిగా 2014లో పాయకరావుపేట నియోజకవర్గం నుంచి గెలుపొందిన అనిత, అనతి కాలంలోనే అసెంబ్లీలో ఫైర్ బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. వైసీపీ ఐరన్ లేడి రోజాతో అనిత చేసిన రచ్చ రాజకీయం, అసెంబ్లీని వేడెక్కించింది. సెటైర్లు వేయడంలోను, ప్రతిపక్షనేతలను ఇరుకున పెట్టడంలోను అనిత స్టైలే వేరు. ముఖ్యంగా ఎమ్మెల్యే రోజాతో వివాదం, అసెంబ్లీలో కన్నీరు కారుస్తూ అనిత చేసిన హడావుడి, పొలిటికల్ పంచ్ సోషల్ మీడియా కేసులతో నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలిచారు అనిత. అయితే ఉన్నట్టుండి ఆమె ఇప్పుడు పూర్తిగా మౌనందాల్చారు.

తన వివాదాస్పద వ్యవహార శైలి వల్లే, మంత్రి పదవిని, టీటీడి బోర్డు ఛైర్మన్ పదవిని కూడా అనిత పోగొట్టుకున్నారని టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చర్చ జరిగింది. అయితే 2019 ఎన్నికల్లో సీటు సంపాదించుకున్నా, తాను ప్రాతినిధ్యం వహించిన పాయకరావు పేట నుంచి కాకుండా కొవ్వూరు నుంచి పోటీ చేశారు. ఫ్యాన్‌ సునామీలో ఓటమిపాలయ్యారు. అప్పటి నుంచి తెరమరుగయ్యారు అనిత.

అయితే ఎప్పుడూ వార్తల్లో నిలిచే అనిత, తెరమరుగు కావడంతో అనేక పుకార్లకు ఆస్కారం ఏర్పడుతోంది. ఇప్పటికే విశాఖ జిల్లాకే చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావుపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన తాను టీడీపీని విడిచి వెళ్లనంటున్నా, 16 మంది టీడీపీ ఎమ్మెల్యేలను తన వెంట తీసుకుని, బీజేపీలోకి వెళతారని పుకార్లు మాత్రం షికారు చేస్తున్నాయి. ఆ జాబితాలో మాజీ ఎమ్మెల్యే అనిత కూడా ఉన్నారని స్థానికంగా చర్చ జరుగుతోంది. అనిత కూడా సైలెంట్‌గా ఉండటంతో, వీటికి మరింత బలాన్నిస్తోంది. అయితే అలాంటిదేమీలేదని ఆమె అంటున్నారు. తాను ఏ పార్టీలోనూ చేరేదిలేదు, రాజకీయాలను విడిచిపెట్టేది లేదంటూ చెబుతున్నారు. కేవలం వ్యక్తిగత కారణాలతో విరామం మాత్రమే తీసుకున్నానని, అతిత్వరలో మళ్లీ క్రియాశీలకం అవుతానని అంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories