మంత్రి నానిపై దాడితో ఉలిక్కిపడిన ఏపీ

మంత్రి నానిపై దాడితో ఉలిక్కిపడిన ఏపీ
x
Highlights

ఏపీ మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు మంత్రిపై దాడి చేసిందెవరు..? పేర్ని నానీని హత్య చేయడమే అతని లక్ష్యమా..?...

ఏపీ మంత్రి పేర్నినానిపై హత్యాయత్నం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు మంత్రిపై దాడి చేసిందెవరు..? పేర్ని నానీని హత్య చేయడమే అతని లక్ష్యమా..? ఈ మొత్తం ఘటనపై పోలీసులు ఏం చెబుతున్నారు..?

మంత్రి పేర్ని నానిపై జరిగిన హత్యాయత్నంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది. పదునైన తాపీతో మంత్రిని పొడిచేందుకు రెండుసార్లు విఫలయత్నం చేశాడు నిందితుడు. దాడి ఘటనలో మంత్రి చొక్కా చినిగి పోగా తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రిపై దాడికి పాల్పడిన వ్యక్తి తాపీ మేస్త్రి బడుగు నాగేశ్వరావుగా గుర్తించారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రి నాని పై హత్యాయత్నం జరిగిన విషయం తెలియటంతో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు నాని నివాసానికి చేరుకున్నారు. పలువురు నేతలు మంత్రి నాని కి ఫోన్ చేసి పరామర్శించారు. ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

తనపై జరిగిన దాడి ఘటనపై మంత్రి నాని స్పందించారు. తన తల్లి దశదిన కర్మ జరుగుతుండడంతో అభిమానులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఇంటికొచ్చినట్లు తెలిపారు. ఆ సమయంలోనే ఒక వ్యక్తి తన కాళ్లపై పడుతున్నట్లు ముందుకు వచ్చి తనపై దాడి చేసినట్లు వివరించారు. ఈ మొత్తం ఘటనలో అదృష్టవశాత్తు తనకు ఏం కాలేదన్న మంత్రి తాను క్షేమంగానే ఉన్నట్లు వివరించారు.

మరోవైపు నిందితుడిపై కేసు నమోదు చేశామన్న కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్.. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. దాడికి పాల్పడింది తాపీ పనిచేసే బడుగు నాగేశ్వరరావు అని గుర్తించామన్నారు. మద్యం మత్తులో దాడి చేశాడా? మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో విచారణ జరుపుతున్నామని త్వరలో వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

రాష్ట్ర మంత్రిపైనే హత్యయత్నం జరగడం ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే మంత్రిపై దాడి వెనుక ఉన్న కారణాలు ఏంటనేది ప్రస్తుతం ప్రశ్నార్తకంగా మారింది. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న నిందితుడిని విచారిస్తున్న పోలీసులు ఎలాంటి విషయాలను బయటపెడతారన్న ఉత్కంఠ అందరిలోను కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories