దర్శి వైసీపీ ఇంచార్జ్ గా మద్దిశెట్టి..? నిన్న జగన్ ను కలిసి..

దర్శి వైసీపీ ఇంచార్జ్ గా మద్దిశెట్టి..? నిన్న జగన్ ను కలిసి..
x
Highlights

వైసీపీ అధినేత వైయస్ జగన్ ను శుక్రవారం ప్రముఖ పారిశ్రామిక వేత్త మద్దిశెట్టి వేణుగోపాల్ కలిశారు. ఈ సందర్బంగా పార్టీలో చేరికపై జగన్ తో చర్చించారు...

వైసీపీ అధినేత వైయస్ జగన్ ను శుక్రవారం ప్రముఖ పారిశ్రామిక వేత్త మద్దిశెట్టి వేణుగోపాల్ కలిశారు. ఈ సందర్బంగా పార్టీలో చేరికపై జగన్ తో చర్చించారు వేణుగోపాల్. జగన్ ఓకే చెప్పడంతో ప్రజాసంకల్ప యాత్ర ముగింపు రోజున ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు దర్శి అసెంబ్లీ టికెట్ ఇస్తున్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు దర్శి ఇంచార్జ్ బాధ్యతలు స్వీకరించాల్సిగా వేణుగోపాల్ ను జగన్ కోరినప్పటికీ ఆయన సంక్రాంతి తరువాత బాధ్యతలు తీసుకుంటానని చెప్పినట్టు సమాచారం.

ఇదిలావుంటే గత ఎన్నికల్లో పోటీచేసిన బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఈసారి ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మరో నేత అయిన బాదం మాధవరెడ్డిని దర్శికి ఇంచార్జ్ గా నియమించింది వైసీపీ. అయితే మంత్రి శిద్దా రాఘవరావుకు ఆయన సరిపోటి కాదని జగన్ భావించారు. ఈ క్రమంలో ప్రత్యామ్నాయం వైపు ఆలోచించారు. ఈ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం బలంగా ఉంది. దాంతో ఒంగోలులో పేస్ఇంజనీరింగ్ కాలేజీ నిర్వహిస్తున్న మద్దిశెట్టి వేణుగోపాల్ ను ఎన్నికల బరిలోకి దింపడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన కూడా వైసీపీలో చేరాలని కొంతకాలంగా వేచిచూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories