చంద్రబాబు, వల్లభనేని వంశీ మధ్య వాట్సాప్‌ రాజకీయాలు.. అయోమయంలో టీడీపీ క్యాడర్‌

చంద్రబాబు, వల్లభనేని వంశీ మధ్య వాట్సాప్‌ రాజకీయాలు.. అయోమయంలో టీడీపీ క్యాడర్‌
x
Highlights

టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మధ్య వాట్సాప్‌ రాజకీయాలు నడుస్తున్నాయి. కేవలం వాట్సాప్‌లోనే మెసేజ్‌లు పంపుకుంటున్నారు. గతంలో లేఖలు...

టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మధ్య వాట్సాప్‌ రాజకీయాలు నడుస్తున్నాయి. కేవలం వాట్సాప్‌లోనే మెసేజ్‌లు పంపుకుంటున్నారు. గతంలో లేఖలు రాసి వాట్సాప్‌లో పెట్టే పరిస్థితి నుండి... డైరెక్ట్‌గా మెసేజ్‌లు పెట్టే పరిస్థితికి వచ్చింది. ఇరువురి మెసేజ్‌లతో టీడీపీ క్యాడర్‌ అయోమయానికి గురవుతోంది.

టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి చంద్రబాబు నాయుడు వాట్సప్ మెస్సెజ్ చేశారు. పార్టీతో మీ చారిత్రక అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారని పేర్కొన్నారు. పార్టీ నుండి, నా మద్దతుతో మీరు ఇంతకముందు అన్యాయానికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడరని అన్నారు. వైసీపీ ప్రభుత్వ అన్యాయానికి వ్యతిరేకంగా ప్రస్తుత పోరాటంలో పార్టీతో పాటు నేను మీ వెనుక గట్టిగా ఉన్నామని తెలిపారు చంద్రబాబు. ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యత కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి కేశినేని నాని, మాజీ ఎంపీ కొనకల్ల నారాయణ రావుకు అప్పగించినట్లు మెస్సెజ్ లో పేర్కొన్నారు. ఇతర అన్ని సమస్యలు పరిష్కరించడానికి భరోసా ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories