రోజా ఆడియో టేపుల కలకలంపై వైసీపీ అధిష్టానం స్పందనేంటి?

రోజా ఆడియో టేపుల కలకలంపై వైసీపీ అధిష్టానం స్పందనేంటి?
x
రోజా ఆడియో టేపుల కలకలంపై వైసీపీ అధిష్టానం స్పందనేంటి?
Highlights

వైసీపీలో రోజా ఆడియో టేప్‌ కలకలం సృష్టిస్తోంది. సొంత పార్టీ నాయకులకే ఆమె వార్నింగ్‌ ఇవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది.

వైసీపీలో రోజా ఆడియో టేప్‌ కలకలం సృష్టిస్తోంది. సొంత పార్టీ నాయకులకే ఆమె వార్నింగ్‌ ఇవ్వడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇంతకీ నగరిలో రోజాకు ఎవరి గొడవ? ఎవరి ఫంక్షన్‌కు వెళ్లొద్దని ఆడియో మెసేజ్ పంపింది? రోజా మాటల ప్రకంపనల తర్వాత, చివరికి ఆ ఫంక్షన్‌కు మంత్రులు, ఎమ్మల్యేలు వెళ్లారా?

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఫైర్‌ బ్రాండ్‌ లీడర్‌, సీఎం జగన్‌కు నమ్మినబంటుల్లో ఒకరుగా పేరు తెచ్చుకున్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, విడుదల చేసిన ఓ వాట్సాప్‌ ఆడియో మెసేజ్‌ సంచలనమైంది. రోజా వార్నింగ్ ఇచ్చారు...తన వ్యతిరేకుల ఫంక్షన్‌కు వెళ్లొద్దని హెచ్చరించారు, తనను ఓడించడానికి కుట్రపన్నినవారి వేడుకకు అటెండ్ కావొద్దని, వెళ్తే ఇక పార్టీ నుంచి వెళ్లిపోయినట్టేనని గట్టి సందేశమే పంపారు. ఇంతకీ రోజా ఎవరి ఫంక్షన్‌కు వెళ్లొద్దన్నారు? వారితో రోజా గొడవేంటి?

నగరి మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ కేజే కుమార్‌ షష్టిపూర్తి ఫంక్షన్‌. ఆయన వైసీపీ స్థానిక లీడర్‌. ఈయన ఫంక్షన్‌కే వెళ్లొద్దంటూ, రోజా వార్నింగ్ ఇచ్చారు. కుమార్‌ ఫంక్షన్‌కు వెళితే, పార్టీ పరంగా కఠినమైన చర్యలుంటాయని హెచ్చరించారు. అయితే, కేజే కుమార్‌ కూడా, వైసీపీ లీడరే. రోజా కంటే ముందు నుంచే వైసీపీలో వున్నారు. మరి కుమార్‌తో రోజా గొడవేంటి?

నగరి మున్సిపల్ చైర్మన్‌గా వ్యవహరించిన కుమార్‌కు, స్థానికంగా మంచి పట్టుంది. రోజా కంటే ముందు నుంచే వైసీపీలో వున్నారాయన. అయితే, కుమార్‌ కూడా నగరి ఎమ్మెల్యే టికెట్‌ ఆశించారు. 2014, 2019లోనూ టికెట్‌ కోసం ప్రయత్నించి, రోజా లాబీయింగ్ ముందు తేలిపోయారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కుమార్, ఆయన ద్వారా టికెట్ ప్రయత్నించినా పొందలేకపోయారు. ఈ నేపథ్యంలోనే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా కుమార్ పని చేశారని, తనను ఓడించేందుకు కుట్ర పన్నారని రోజా రగిలిపోతున్నారు. ఒకే పార్టీలోనే వుంటూ, తనను ఓడించడానికి ప్రయత్నించిన కుమార్‌ ఫంక్షన్‌కు వెళ్లొద్దని స్థానిక కార్యకర్తలకు వార్నింగ్ ఇచ్చారు.

రోజా వార్నింగ్‌తో, కుమార్‌ షష్టిపూర్తికి అతిథులు సైతం రాకుండా వుండిపోయారట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యక్రమానికి వస్తారని, కుమార్ సైతం చెప్పుకున్నారు. రోజా గొడవ నేపథ్యంలో, ఆయన రావడంలేదని చెప్పేశారట. మొత్తానికి నగరి వైసీపీలో ఆధిపత్యపోరు, పతాకస్థాయికి చేరింది. రోజా వర్గం, కుమార్ వర్గంగా నగరి వైసీపీ చీలిపోయింది. అయితే, నేతల కోల్డ్‌‌వార్‌పై అధిష్టానం కోపంగా వుందట. రోజా వార్నింగ్ వాట్సాప్ మెసేజ్‌ను పరిశీలిస్తోందట. చూడాలి, నగరి కోల్డ్‌వార్‌ ఎలాంటి మలుపు తిరుగుతుందో?


Show Full Article
Print Article
More On
Next Story
More Stories