'మహారాజా కళాశాల'.. విద్యార్థుల డిమాండ్ ఎంటి?

మహారాజా కళాశాల.. విద్యార్థుల డిమాండ్ ఎంటి?
x
Highlights

వందల ఏళ్ల చరిత్ర.. వేలాది మందికి ఉచిత విద్యా. మూడు జిల్లాల విద్యార్థులకు భరోసా.. విజయనగరం జిల్లాలోని మహారాజా కాలేజ్. వేలాది మందిని విద్యావంతులుగా...

వందల ఏళ్ల చరిత్ర.. వేలాది మందికి ఉచిత విద్యా. మూడు జిల్లాల విద్యార్థులకు భరోసా.. విజయనగరం జిల్లాలోని మహారాజా కాలేజ్. వేలాది మందిని విద్యావంతులుగా మార్చింది. కానీ ఈ కాలేజ్‌ని ప్రవేటీకరణ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. విద్యార్థులు రోడ్డెక్కారు. నిరసనలు చేపట్టారు. చివరకు ప్రవేటీకరణ నిర్ణయం నిలిచిపోయింది. పైగా అడ్మిషన్లు కూడా చక చక జరిగిపోతున్నాయి.

అన్నిదానల్లోకెల్లా విద్యాదానం గొప్పది. ఇదే సూత్రాన్ని జీవిత మంత్రంగా మల్చుకున్నారు విజయనగరం జిల్లాకు చెందిన పీవీజీ రాజు. ఆయన మాన్సాస్‌ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి.. వేలాది మందికి ఉచిత విద్య అందిస్తున్నారు. తొలత ఈ ట్రస్ట్‌ ద్వారా ఎల్‌కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్య అందించేవారు. కానీ కాలక్రమంలో ఇంటర్మీడియట్‌ను ఈ ట్రస్ట్‌ నుంచి తొలగించారు.

తాజాగా మన్సాస్ లో ఎయిడేడ్‌ను ఎత్తివేయాలని ట్రస్ట్ సభ్యులు కొత్త వాదన తీసుకువచ్చారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలిని కోరారు. ఇదే జరిగితే తమ భవిష్యత్‌ ఎంటని విద్యార్థులు ఆందోళన చెందారు. అయితే విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకున్న విద్యామండలి ఎయిడేడ్‌ను కొనసాగించాలని ఆదేశించింది. పైగా డిగ్రీ ప్రవేశాలు జరపాలని ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యామండలి ఉత్వర్వుల మేరకు కళాశాల యాజమాన్యం డిగ్రీ అడ్మిషన్లను ప్రారంభించింది. దీంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అత్యాధునిక వసతులు, మెరుగైన విద్యాబోధన మహారాజ కళాశాల సొంతం. అందుకే ఈ కళాశాలలో చదువుకునేందుకు విద్యార్థులు ఆసక్తి కనబరుస్తారు.

ఇదే తరహాలో మాన్సాస్ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఇంటర్మీడియట్‌ను కూడా తిరిగి పున: ప్రారంభించాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. కుటుంబ కలహాలతో మాన్సాస్ ఆశయాన్ని నీరుగార్చవద్దని స్థానికులు కోరుతున్నారు. పీవీజీ రాజు గారి ఆశయాలను నిలబెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories