తల్లి, తనయుడి మధ్య ఏం జరుగుతోంది?

What is Going on Between Vijayamma and Jagan ?
x

తల్లి, తనయుడి మధ్య ఏం జరుగుతోంది?

Highlights

తనయుడు వద్దంటే తల్లి కావాలంటోంది. కొడుకు దూరం పెడితే అమ్మ రమ్మంటూ ఆహ్వానిస్తోంది.

తనయుడు వద్దంటే తల్లి కావాలంటోంది. కొడుకు దూరం పెడితే అమ్మ రమ్మంటూ ఆహ్వానిస్తోంది. తండ్రి హయాంలో చక్రం తిప్పితే తిప్పి ఉండొచ్చు కానీ నా దగ్గర ఆ ఆటలు సాగవంటూ ఆయన పక్కన పెట్టేస్తే అప్పటి అనుభవాన్నంతా రంగరించేందుకు ఆమె పథకరచన చేస్తోంది. అప్పుడెప్పుడో పదేళ్ల కింద కనుమరు అయిన నేతలు ఇప్పుడామెకు ఎందుకు గుర్తుకొస్తున్నారు? ఇన్నాళ్లు, ఇన్నేళ్లు లేనిది ఇప్పుడే ఎందుకు కలవాలని అనుకుంటుంది? ఎందుకు కలవాలని ఫీలవుతుంది.?

వైఎస్‌. జగన్మోహన్‌రెడ్డి. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి. వైఎస్‌ విజయమ్మ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి గౌరవాధ్యక్షురాలు. సీఎం జగన్‌ తల్లి. ఇద్దరు ఒకప్పుడు ఒకే మాట మీద నడిచారు. కలసి అడుగులు వేశారు. ఇప్పుడు ఏందో అయిందని చెప్పడం కాదు కానీ కొందరు నాయకుల విషయంలో ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయట.

ఒకప్పుడు జ‌గ‌న్ కాద‌నుకున్నారు వారిని విజ‌య‌మ్మ ఇప్పుడు కావాల‌నుకుంటున్నారు!! జగ‌న్ వద్దని ప‌క్కన పెట్టేశారు. విజ‌య‌మ్మ ఫోన్ చేసి మరీ పిలుస్తున్నారు. వారంతా వైఎస్సార్ హ‌యాంలో హేమాహేమీలే వైఎస్‌ మర‌ణంతో తెరమరుగైన కీలక నేతలే. కాంగ్రెస్‌లో ఉన్నా లేన‌ట్టుగానే మిగిలిపోయిన నాయకులే. అలాంటి వారందరూ చాలా ఏళ్ల త‌ర్వాత విజ‌య‌మ్మకు ఎందుకు గుర్తు వచ్చారు? అలాంటి నేతల నెంబర్లు కనుక్కొని మరీ ఫోన్‌ చేసి ఎందుకు ప్రత్యేకంగా పిలుస్తున్నారు. దీని వెనుకున్న వ్యూహమేంటి?

వైఎస్. విజయమ్మ మొదటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. భర్త వైఎస్ఆర్ మరణం తర్వాత కొడుకు వైఎస్ జగన్ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి అప్పుడప్పుడే రాజకీయ తెరపై కనిపించింది లేదు. అంతా తెరవెనుక మంత్రాంగమే నడిపేవారని చెప్పుకుంటారు వైఎస్‌ అభిమానులు. అలాంటి విజయమ్మ మరోసారి యాక్టివ్‌ కాబోతున్నారట. తన భర్త వైఎస్ఆర్ వర్థంతిని పురస్కరించుకొని హైదరాబాద్‌లో సెప్టెంబర్ 2న రాజకీయపార్టీలకు అతీతంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారట. బతికున్న రోజుల్లో వైఎస్‌కి అత్యంత సన్నిహితంగా ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రముఖ రాజకీయ నాయకులకు ఫోన్లు చేసి మరీ పిలిపిస్తున్నారట. ఎందుకు? ఇప్పుడిదే ఉభయ రాష్ట్ర రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారుతోంది.

ఏపీలో కేవీపీ, ఉండ‌వ‌ల్లిలాంటి వాళ్లు ఒక‌ప్పుడు వైఎస్‌కు సన్నిహితంగా ఉండేవారు. ఇక తెలంగాణ‌లో డీఎస్‌, కోమ‌టిరెడ్డి, పొన్నంలాంటి వాళ్లు వైఎస్‌ రాజ‌శేఖ‌ర్‌రెడ్డికి న‌మ్మినబంటుల్లా ఉండేవారు. వైఎస్సార్ మ‌ర‌ణించాక వారిలో ఒక్కరు కూడా జ‌గ‌న్ వెంట ప్రయాణించలేదు. కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడంతో జ‌గ‌న్ ఏపీకే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో తెలంగాణలో కరుడుగట్టిన కాంగ్రెస్‌ కీలక నేతలను ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఇవ్వని పక్కన పెడితే స‌డన్‌గా విజ‌య‌మ్మకు ఎప్పుడు లేనంతగా, వైఎస్‌ చనిపోయిన 12 ఏళ్ల తరువాత వాళ్లంతా ఎందుకు గుర్తొచ్చార‌నేదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ హాట్ టాపిక్‌గా మారింది.

ఇదేమంత ప్రత్యేక స‌మ‌య‌మూ కాదు కానీ, ఎందుక‌నో కానీ విజ‌య‌మ్మ వైఎస్సార్ వ‌ర్థంతిని ఈసారి ప్రత్యేకంగా జ‌ర‌పాల‌ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు ప్రత్యేక ఆహ్వానితులుగా అప్పటి వైఎస్సార్‌కు అత్యంత స‌న్నిహితులు, కేబినెట్ స‌హ‌చ‌రుల‌ను ఫోన్ చేసి మ‌రీ ఆహ్వానిస్తున్నార‌ని స‌మాచారం. కేవీపీ, ఉండ‌వ‌ల్లి నుంచి డీఎస్ వ‌ర‌కు ఇరు రాష్ట్రాల్లో ఉన్న వైఎస్సార్ మ‌నుషుల‌ను ఇన్‌వైట్‌ చేయ‌డంపై రాజ‌కీయంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. మరోవైపు ప్రస్తుత రెండు రాష్ట్రాల ప్రభుత్వంలో వివిధ పదవుల్లో ఉన్న సన్నిహితులకి కూడా కాల్స్ వెళ్లాయట. అయితే వారంతా వ‌స్తారా రారా అనేది వేరే సంగతి.

విజ‌య‌మ్మ మునుపెన్నడూ లేనంతగా ఈసారి ఇంతలా ఎందుకు చేస్తున్నారన్నదే అసలు చర్చ. జగన్ కోస‌మా, ష‌ర్మిల కోస‌మా అంటే ఇద్దరి కోస‌మూ అనే వారూ ఉన్నారు. ప్రస్తుతం విజ‌య‌మ్మ జ‌గ‌న్‌కు దూరంగా, ష‌ర్మిలకు దగ్గరగా ఉంటున్నారు. ఎంత‌కాద‌న్నా వారంతా ఒకే కుటుంబం. పైకి ఎలా కనిపించినా వారంతా ఒక్కటేనని చెబుతున్నారు రాజకీయవిశ్లేషకులు. ఇప్పటికైతే ఏపీలో జగన్‌ పరిస్థితి బాగానే ఉన్నా రాజకీయాల్లో ఏ సందర్భంలో ఎలాంటి పరిణామాలు వస్తాయో ఎవరు ఊహించలేం. అటు సీబీఐ కేసులో జగన్‌కు బెయిల్ ర‌ద్దు అయ్యే అవ‌కాశం ఉందన్న ప్రచారాల మధ్య త‌న వైఎస్‌కు న‌మ్మిన కేవీపీ, ఉండ‌వ‌ల్లితో పాటు అప్పట్లో ఆయనకు సన్నిహితంగా ఉండే నేతలతో టచ్‌లోకి వెళ్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఇందులో భాగంగానే వైఎస్సార్ వ‌ర్థంతి సంద‌ర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి, ఆనాటి న‌మ్మద‌గిన నేత‌ల‌ను ఆహ్వానించి వారితో కీల‌క మంత‌నాలు జ‌ర‌పాల‌నేది విజ‌య‌మ్మ ఆలోచ‌న‌గా తెలుస్తుంది.

జ‌గ‌న్‌కు అని విధాలుగా మేలు జరిగేందుకు, వారి స‌ల‌హాలు, సూచ‌న‌లు తీసుకోవాల‌ని విజయమ్మ భావిస్తున్నారట. జ‌గ‌న్‌కు సంబంధం లేకుండా కొడుకు కోసం విజ‌య‌మ్మ ఇదంతా చేస్తున్నారనే టాక్ కూడా వుంది. మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇన్నాళ్లు లేనిది ఆ నేత‌లంతా ఏమేర‌కు స‌హ‌క‌రిస్తారన్నదే అసలు చర్చ. అదీగాక, తెలంగాణలో వైఎస్సార్ పేరు మీద పార్టీ పెట్టిన ష‌ర్మిల‌కు ఆశించిన స్థాయిలో ఫలితం రావడం లేదు. ఒక్క కోమ‌టిరెడ్డి బ్రద‌ర్స్ ఆల్ ది బెస్ట్ చెప్పడం మిన‌హా ఆమెకు కొత్తగా ఎవరు స‌పోర్ట్ చేయ‌డం లేదు. అందుకే, వైఎస్సార్ వ‌ర్థంతి సందర్భంతో సెంటిమెంట్‌ను రాజేసేందుకు విజ‌య‌మ్మ ప్రయ‌త్నిస్తున్నార‌ట. మరి ఇటు కొడుకు అటు కూతురు కోసం విజయమ్మ చేస్తున్న ఈ ప్రయత్నం ఏమేర‌కు వర్కవుట్ అవుతుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories