GBS Virus: ఏపీలో భారీగా జీబీఎస్ కేసులు నమోదు..ఒక్కో ఇంజెక్షన్ రూ.20వేలు..ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త

GBS Virus: ఏపీలో భారీగా జీబీఎస్ కేసులు నమోదు..ఒక్కో ఇంజెక్షన్ రూ.20వేలు..ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త
x
Highlights

GBS Virus: ఆంధ్రప్రదేశ్ లో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదు అవుతున్నప్పటికీ దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్...

GBS Virus: ఆంధ్రప్రదేశ్ లో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు నమోదు అవుతున్నప్పటికీ దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. సచివాలయంలో ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన రాష్ట్రంలో జీబీఎస్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చికిత్స అందిస్తున్నామని తెలిపారు.

జీబీఎస్ బాధితులకు అవసరమైన ఇమ్యూనోగ్లోబుల్ ఇంజెక్షన్లు ప్రభుత్వం అందుబాటులో ఉంచిందని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఈ వ్యాధి ఉన్నవారిలో చాలా మందికి చికిత్స అవసరం లేకుండానే స్వయంగా తగ్గుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 43 జీబీఎస్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 17 మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. గత ఏడాది ఈ ఏడాది నమోదు మొత్తం కేసులపై విశ్లేషన చేసి ఈ వ్యాధి వ్యాప్తికి కారణాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారమని మంత్రి తెలిపారు. జీబీఎస్ బాధితులకు రాష్ట్రవ్యాప్తంగా సరిపడా ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వ్యాధి సోకిన 85 శాతం మంది చికిత్స లేకుండానే కోలుకుంటున్నారు. కేవలం 15శాతం మందికి మత్రమే ఇంజెక్షన్లు అవసరమవుతాయని మంత్రి తెలిపారు.

ప్రస్తుతం అనంతపురం, కాకినాడ, కడప, గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖ ప్రభుత్వాసుపత్రుల్లో 749 ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా 469 ఇంజెక్షన్లు స్టాక్ లో ఉన్నాయి. అవసరం అయితే మరింతమందికి చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రతి ఇంజెక్షన్ ఖర్చు రూ. 20వేల వరకు ఉంటుంది. ఒక్క రోగికి రోజుకు 5 ఇంజెక్షన్లు అవసరమవుతాయి. మొత్తం 5రోజుల పాటు చికిత్స కొనసాగుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం ఖర్చు గురించి ఆలోచించకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తోందని స్పష్టం చేశారు.

గులియన్ బారే సిండ్రోమ్ అనేది అరుదైన నాడీ సంబంధిత వ్యాధి. ఇది రోగనిరోధక వ్యవస్థ నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. ముఖ్యంగా బ్యాక్టీరియా, వైరస్ సంక్రమణలు లేదా కొన్ని టీకాల ప్రభావం వల్ల ఇది సంభవించే ఛాన్స్ ఉంది.

లక్షణాలు ఎలా ఉంటాయంటే తొలుత కాళ్లలో బలహీనత ప్రారంభమై చేతులు, ముఖానికి వ్యాపిస్తుంది. నడవానికి ఇబ్బంది, కండరాల నొప్పి ఉంటుంది. తీవ్రమైన సందర్భాల్లో పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది. శరీరంలో సూదులతో గుచ్చినట్లు అనిపిస్తుంది. ముఖ కదలికలో సమస్యలు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగం మారడం, జీబీఎస్ సోకినవారు రెండు వారాల్లో అత్యంత తీవ్రమైన దశకు చేరుకుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories