Top
logo

పశ్చిమ గోదావరి ప్రజల అభినందనల జల్లులో మండలి ఛైర్మన్ షరీఫ్

పశ్చిమ గోదావరి ప్రజల అభినందనల జల్లులో మండలి ఛైర్మన్ షరీఫ్పశ్చిమ గోదావరి ప్రజల అభినందనల జల్లులో మండలి ఛైర్మన్ షరీఫ్
Highlights

శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌కు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఘన స్వాగతం పలికారు. మండలిలో మూడు రాజధానుల...

శాసనమండలి ఛైర్మన్‌ షరీఫ్‌కు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఘన స్వాగతం పలికారు. మండలిలో మూడు రాజధానుల వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆయన చిత్రపటానికి అమరావతి జేఏసీ నేతలు పాలాభిషేకం చేశారు. నరసాపురం వెళ్తుండగా పాలకొల్లు గాంధీబొమ్మ సెంటర్‌లో ఆయనకు పూలమాల వేసి అభినందనలు తెలియజేశారు.

అధర్మం రాజ్యమేలుతున్న సమయంలో ఒత్తిడులను ఎదుర్కొని ధర్మాన్ని నిలబెట్టడంలో మండలి ఛైర్మన్‌ పాత్ర కీలకమన్నారు మాజీ ఎమ్మెల్యే ధూళ్లిపాళ్ల నరేంద్ర. శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపినందుకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ చిత్రపటానికి ధూళ్లిపాళ్ల నరేంద్ర పాలాభిషేకం చేశారు.

Web TitleWest Godavari people shower praises on council chairman
Next Story


లైవ్ టీవి