Chandrababu: రేణిగుంట విమానాశ్రయం వద్ద బాబుకు ఘనస్వాగతం

Chandrababu: రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న చంద్రబాబు దంపతులు

Shekhar G
Published on: 30 Nov 2023 7:43 PM IST
Welcome to Chandrababu At Renigunta Airport
X

Chandrababu: రేణిగుంట విమానాశ్రయం వద్ద బాబుకు ఘనస్వాగతం

Chandrababu: తిరుపతి రేణిగుంట ఎయిర్‌పోర్ట్ వద్ద చంద్రబాబుకు టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో బెయిల్ పొందిన తరువాత బాబు మొదటిసారి సొంత జిల్లాకు రావడంతో టీడీపీ, జనసేన శ్రేణఉలు రేణిగుంట విమానాశ్రయం వద్ద పూల వర్షం కురిపించారు.. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరితో సహా రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు బయలుదేరారు.. పద్మావతి సముదాయంలోని గాయత్రి అతిధిగృహంలో రాత్రి బస చేసి, రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు చంద్రబాబు.

Shekhar G

Shekhar G

Next Story