ఆగ్నేయ బంగాళాఖాతంతో అల్ప పీడనం

ఆగ్నేయ బంగాళాఖాతంతో అల్ప పీడనం
x
Representational Image
Highlights

దక్షిణ అండమాన్‌ నుంచి ఆగ్నేయ బంగాళఖాతం వరకు అల్ప పీడనం ఏర్పడింది..

దక్షిణ అండమాన్‌ నుంచి ఆగ్నేయ బంగాళఖాతం వరకు అల్ప పీడనం ఏర్పడింది.. ఈ విషయాన్నీ ఆంధ్ర ప్రదేశ్‌ విపత్తు నిర్వాహణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ ఈ సమాచారం‌ వెల్లడించారు. రానున్న 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి దక్షిణ అండమాన్‌ తీరంలో గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ భావించింది. అయితే ఏ రాష్ట్రాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుందో ఖచ్చితంగా వివరించలేదు.

కానీ ఆగ్నేయా బంగాళాఖాతం, దక్షిణ అండామాన్‌ సముద్ర పరిస్థితులు కఠినంగా ఉంటాయన్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావం ఏపీపై ఉండదని అధికారులు స్పష్టం చేశారు. కాగా మత్సకారుల చాపల వేటకు వెళ్లోద్దని.. ఒకవేళ వెళ్లినా ఆగ్నేయ బంగాళాఖాతం వైపునకు మాత్రం వెళ్లోద్దని విపత్తు నిర్వాహణ శాఖ డైరెక్టర్‌‌ హెచ్చరించారు.


Show Full Article
Print Article
Next Story
More Stories